పుతిన్ భారత్ టూర్ ను ప్రపంచ మీడియా ఎంతలా కవర్ చేసింది?

భారత దేశంలో ఏమి జరుగుతోంది. రష్యా అధినేత పుతిన్ పర్యటన నేపథ్యంలో ఏ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.;

Update: 2025-12-06 03:46 GMT

భారత దేశంలో ఏమి జరుగుతోంది. రష్యా అధినేత పుతిన్ పర్యటన నేపథ్యంలో ఏ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇదే ఇపుడు ఇంటర్నేషనల్ మీడియా ఆసక్తి. భారత్ మీదనే కెమెరా కన్ను పెట్టి కన్నార్పకుండా చూస్తోంది. చీమ చిటుక్కుమన్నా కూడా వదలకుండా మీడియాలో కవరేజ్ ఇస్తోంది. మినిట్ టూ మిట్ ప్రతీ సీన్ ని ప్రపంచం ముందు పెడుతోంది. దాంతో ఎన్నడూ ఊహించని విధంగా భారత్ ఇపుడు అంతర్జాతీయ మీడియాలో నలిగి నానుతోంది.

అమెరికా టూ అంతా :

భారత్ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసిన ప్రపంచ దేశాల జాబితా చాలా పెద్దదే. అమెరికా నుంచి మొదలెడితే ఉక్రెయిన్ వరకూ అన్ని దేశాలు పుతిన్ భారత పర్యటన మీద పూర్తి ఏకాగ్రతతో పరిశీలించడం మొదలెట్టాయి. ఇక దాదాపుగా అంతర్జాతీయంగా మీడియా అంతా ఇదే అం|శాన్ని తెగ హైలెట్ చేస్తోంది. అలాగే ఫుల్ కవరేజ్ తో పాటు టాప్ హెడ్ లైన్స్ తో హడావుడి చేస్తోంది. మీడియా వరల్డ్ అంతా భారత్ లో పుతిన్ ప్రతీ కదలికను నమోదు చేస్తోంది. భారత్ తో రష్యా దోస్తీని అల్లుకుని కధనాలను పెద్ద ఎత్తున ప్రసారం చేస్తోంది.

రియాక్ట్ అయిన చైనా :

ఇక భారత్ లో పుతిన్ పర్యటన మీద చైనా మీడియా అయితే ఇంట్రెస్టింగ్ గా రియాక్ట్ అయింది. పుతిన్ తాజా పర్యటన రెండు దేశాల మధ్య బలమైన బంధాన్ని తెలియచేస్తున్నాయని అన్నారు. ఈ రెండు దేశాలు అత్యంత సన్నిహిత మైనవని పాశ్చాత్య ప్రభావానికి ఏ మాత్రం లొంగని జంకని వైఖరిని ప్రదర్శించే గట్టి దేశాలు అని చైనా అభివర్ణించింది. అమెరికా ఆంక్షలు కానీ ఒత్తిడి కానీ ఇక మీద పనిచేయకపోవచ్చు అని చైనా మీడియా విశ్లేషించింది.

ఏ దేశమూ ఒంటరి కాదు :

ఈ ప్రపంచంలో ఏ దేశమూ ఒంటరి అయితే కానే కాదని చైనా మీడియా అంటోంది. పుతిన్ పర్యటన అందుకు ఒక ఉదాహరణగా చెబుతోంది. ఇక చైనా ఫారెన్ అఫైర్స్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్ లీ హైడాంగ్ గ్లోబల్ టైమ్స్‌తో మాట్లాడుతూ కీలకమైన వ్యాఖ్యలే చేసారు. భారత్, రష్యా దేశాలు ఎవరిపైనా ఆధారపడని దేశాలుగా ఆయన చెప్పారు. ఈ రెండు దేశాలూ తమదైన సొంత సామర్థ్యాలతో ఎదిగాయని తాముగానే శక్తిమంతంగా తయారు చేసుకునే క్రమ్మలో ముందుకు సాగుతున్నాయని విశ్లేషించారు. ఇక ఈ రెండు దేశాల మధ్యన మంచి సమన్వయం, సహకారం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఒకరి మీద మరొకరికి విశ్వాసం ఉందని, అందుకే బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దాంతో అమెరికా పాటుగా ఇతర పశ్చిమ దేశాల ఆంక్షలతో పాటు వారు పెట్టే ఒత్తిడి ఏ విధంగానూ ఈ దేశాల మీద ప్రభావం అయితే చూపించలేవని ఆయన అంటున్నారు.

Tags:    

Similar News