పెట్టుబడులు పోటెత్తించాల్సిందే...మరోసారి లోకేష్ విదేశీ టూర్
మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటన చేపట్టబోతున్నారు. ఈసారి అయిదు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది.;
మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటన చేపట్టబోతున్నారు. ఈసారి అయిదు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. ఈ నెల 6వ తేదీ నుంచి 10 వరకు అమెరికా, కెనడా టూర్ ని లోకేష్ పెట్టుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధనే లక్ష్యంగా లోకేష్ టూర్ సాగుతుందని అంటున్నారు. ఈ అయిదు రోజుల టూర్ లో లోకేష్ ఫుల్ బిజీగా గడపనున్నారు అని అంటున్నారు. ఆయన క్షణం తీరిక లేకుండా టైట్ షెడ్యూల్ తో మొత్తంగానే డిజైన్ చేసుకున్నారు. మొత్తం టూర్ లో ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు తేవాలన్నది లోకేష్ టార్గెట్ గా ఉంది అని చెబుతున్నారు.
ఇదీ షెడ్యూల్ :
ఇక ఇక ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించడం ఇది రెండోసారి. అదే విధంగా లోకేష్ ఈ నెల 6నుంచి 10 వరకూ చేపట్టే ఈ టూర్ లో భాగంగా మొదటి రోజు అయిన 6 న డల్లాస్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారని చెబుతున్నారు. అలాగే 8,9 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా పలు కంపెనీల ప్రతినిధులతో లోకేష్ సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఏపీకి పెట్టుబడుల ఆవశ్యకత గురించి ఆయన వారితో చర్చించి ఏపీ కల్పించే సదుపాయాలు మౌలిక వసతుల గురించి కూడా వివరిస్తారు అని అంటున్నారు.
కెనాడాతో బంధం :
ఇక లోకేష్ టూర్ లో కెనాడా చేరింది. అక్కడ నుంచి కూడా పెట్టుబడులను సాధించే లక్ష్యంలో ఆయన పర్యటన ఉందని చెబుతున్నారు. తన పర్యటనలో చివరి రోజు అయిన 10 న కెనడాలోని టొరంటోలో లోకేష్ పర్యటిస్తారని అంటున్నారు. ఇప్పటికే లోకేష్ పెట్టుబడుల సాధన కోసం అనేక దేశాలు పర్యటించి వచ్చారు. గత ఏణ్ణర్థం కాలంగా చూస్తే కనుక నారా లోకేష్ అమెరికా, దావోస్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాలలో పర్యటించారు.
బాబు బ్రాండ్ అంటూ :
లోకేష్ ఏపీకి తన పర్యటనలో పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీకి అసలైన బ్రాండ్ ఎవరో కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆయన చెబుతున్నారు. ఏపీకి ఏముంది అని ఎవరైనా అడిగితే విజనరీ సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబే మాకు ఉన్నారని చెప్పడం ద్వారా పెట్టుబడులను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. అలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రాండ్ అంటూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలను వివరిస్తూ ఇప్పటివరకు మంత్రి లోకేష్ చేసిన పర్యటనల వల్ల ఏపీకి భారీగానే పెట్టుబడులు వచాయని అంటున్నారు. దానికి సరైన ఉదాహరణగా ఇటీవల విశాఖలో జరిగిన పార్టనర్ షిప్ సమ్మిట్ లో ఏపీకి పెట్టుబడులు పోటెత్తాయని అంతా గుర్తు చేసుకుంటున్నారు. ఈ తాజా పర్యటనలో లోకేష్ మరిన్ని పెట్టుబడులు ఏపీకి తెస్తారు అని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు.