తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులు ఏపీ వాసులు

ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుందగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.;

Update: 2025-12-06 04:46 GMT

కొన్ని ప్రమాదాల్ని చూస్తున్నప్పుడు.. మన తప్పు లేకున్నా.. ఎదుటోడు చేసే తప్పులకు బలి కావాల్సి వస్తుంది. తాజాగా తమిళనాడులో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఈ కోవకు చెందినదిగా చెప్పాలి. నలుగురు ప్రాణాలు తీసిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో బాధితులంతా ఏపీకి చెందిన వారే కావటం గమనార్హం. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుందగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

ఉత్తరాంధ్రకు చెందిన అయ్యప్ప భక్తులు కారులో శబరిమలకు వెళ్లారు. స్వామి దర్శనం చేసుకొని తమిళనాడు పర్యటనకు వెళ్లారు. అక్కడి రామేశ్వరం వెళ్లి వస్తున్న వేళ.. అలిసిపోయి ఉండంతో రోడ్డు పక్కన తమ కారును ఆపి నిద్రపోతున్నారు. ఇదే సమయంలో వేగంగా వచ్చిన లారీ వీరి కారును ఢీ కొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మరణించారు.

మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు విజయనగరం జిల్లాకు చెందిన వారిగా చెబుతున్నారు. శబరిమలకు వెళ్లి వస్తుండగా చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఆయా కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News