భూమిపూజకు టైం డిసైడ్ చేసిన ఆయనకు బెదిరింపులు

Update: 2020-08-04 04:45 GMT
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కీలకమైన భూమిపూజకు ముహుర్తం డిసైడ్ చేయటం తెలిసిందే. ఈ నెల ఐదున మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ముఖ్యమైన శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. అయితే.. ఈ ముహుర్తంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్యన విశాఖ శారదా పీఠాధిపతి సైతం ముహుర్తం బాగోలేదన్న మాటను చెప్పారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ముహుర్తం పెట్టిన పండితుడికి గుర్తు తెలియని వ్యక్తులు బెదించటం సంచలనంగా మారింది. అయోధ్య రామాలయానికి నిర్ణయించిన ముహుర్తం బాగోలేదని.. దాన్ని మార్చాలన్నది వారి డిమాండ్ గా చెబుతున్నారు. ఇంతకీ.. ముహుర్తం పెట్టిన పెద్దమనిషి ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం. కర్ణాటకలోని బెళగావికి చెందిన ఎన్.ఆర్. విజయేంద్రశర్మ అయోధ్య రామాలయ నిర్మాణ భూమిపూజకు ముహుర్తాన్ని నిర్ణయించారు.

భూమిపూజకు పెట్టిన ముహుర్తం బాగోలేదని.. దాన్ని వెంటనే మార్చాలంటూ కొందరు గుర్తు తెలియని వారు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే.. శర్మ వాదన వేరేగా ఉంది. తనను ముహుర్తం పెట్టి ఇవ్వాలన్నప్పుడు మొత్తం తాను రెండు ముహుర్తాలు పెట్టాలనని.. అందులో ఒకదాన్ని రామజన్మభూమి ట్రస్టు నిర్ణయించిదని చెబుతున్నారు. మరీ.. ముహుర్త వివాదం ఎక్కడి వరకూ వెళుతుందో చూడాలి.
Tags:    

Similar News