మెమ‌న్ ఉరి....వ‌ర్మ స్పంద‌న‌

Update: 2015-07-30 06:21 GMT
ప్రతి విషయానికి తనదైన స్టైల్లో స్పందించే రాంగోపాల్‌ వర్మ యాకుబ్‌ మెమన్‌ ఉరిపై కూడా స్పందించాడు. "యాకుబ్‌ మొమన్‌పై కొంతమంది జాలి చూపిస్తున్నారు. ఎందుకంటే అతను గానీ, అతని ఫొటోలు గానీ ఒక సామాన్యుడిలాగా ఉన్నాయి. మనలాగే అత‌డూ చాలా సాదాసీదాగా కనిపిస్తున్నాడు. కానీ 1993లో జరిగిన ముంబాయ్‌ పేలుళ్ల ఘటనలో ఎంతోమంది చనిపోయారు.  257 మంది మ‌ర‌ణం ఒక నంబర్‌ లాగే కనిపిస్తున్నట్లు ఉండ‌టం వ‌ల్ల కొంతమందికి జాలి కలుగుతోంది''అని తనదైన స్టైల్లో  ట్విట్ట‌ర్‌ లో వెటకరించాడు వర్మ.

మ‌రోవైపు కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దిగ్విజ‌య్ సింగ్ సైతం త‌న‌దైన శైలిలో స్పందించాడు. ట్విట్ట‌ర్‌ లో త‌న అభిప్రాయాన్ని పోస్ట్ చేశాడు. కేంద్రం మొమ‌న్ విష‌యంలో అవ‌లంభించిన చొర‌వ‌నే అంద‌రి విష‌యంలోనూ చూపాల‌న్నారు. కులం, మ‌తం, ప్రాంతం ఆధారంగా ప‌క్ష‌పాతం చూపించ‌డం స‌రికాద‌న్నారు. ప్ర‌భుత్వం న్యాయ‌స్థానాలు కూడా ఇదే రీతిలో ముందుకు వెళ్లాల‌ని దిగ్విజ‌య్ సింగ్ తెలిపారు.
Tags:    

Similar News