మోడీ మీద అలాంటి వ్యాఖ్యలు..షాకిచ్చిన వెంకయ్య

Update: 2020-02-14 05:45 GMT
ప్రభుత్వ ఉద్యోగి గా ఉన్న వేళలో మిగిలిన వారి మాదిరి వ్యవహరించే వీల్లేదు. అందులోనూ కీలకస్థానాల్లో ఉన్న వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా ప్రధాని లాంటి స్థానంలో ఉన్న వారి మీద అభ్యంతరకర వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో చేసిన వైనంపై రాజ్యసభ ఛైర్మన్.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు.. సదరు తప్పు చేసిన ఉద్యోగికి శిక్ష విధించారు వెంకయ్య.

రాజ్యసభ భద్రతా అధికారి ఉరుజుల్ హసన్ అనే అధికారి రూల్స్ కు భిన్నంగా వ్యవహరించారు. ప్రధాని పై సోషల్ మీడియాలో అభ్యంతరకర.. అవమానించేలా పోస్టులు చేశారు. కీలక స్థానాల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయంగా తటస్థ వైఖరిని అనుసరించాల్సిన అవసరం ఉంది. కానీ.. తన గీతను దాటి వ్యవహరించిన వైనం పై సీరియస్ అయ్యారు. సదరు అధికారి పెట్టిన పోస్టులు క్రమశిక్ష రాహిత్యం తో చేసినట్లు గా పేర్కొన్నారు.

అతను చేసిన పనికి శిక్షగా ఐదేళ్ల పాటు జీతంలో ఎలాంటి పెంపు ఉండకుండా చేయటం తో పాటు.. ఆ కారణం గా పదవీ హోదా కూడా తగ్గేలా వెంకయ్య నిర్ణయం తీసుకున్నారు. శిక్షా కాలం పూర్తి అయ్యే వరకూ ప్రమోషన్ ఉండదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రధాని లాంటి వారి మీద కీలక పదవుల్లో ఉన్న వారు ఆచితూచి అడుగులు వేయాలన్న కనీస విషయాన్ని సదరు అధికారి ఎలా మిస్ అయ్యారో?
Tags:    

Similar News