పోలీసుల అదుపులో కామాంధుడి స్నేహితుడు..

Update: 2021-09-16 03:26 GMT
ఆరేళ్ల చిన్నారిని అమానుషంగా హత్యాచారం చేసిన ఉదంతంలో నిందితుడు రాజు కోసం వందలాది పోలీసులు వెతుకుతున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని జల్లెడ పడుతున్నా.. అతగాడి ఆచూకీ మాత్రం లభించని పరిస్థితి. ఇదిలా ఉండగా.. హత్యాచారం అనంతరం స్నేహితుడితో కలిసి వెళుతున్న రాజును గుర్తించిన పోలీసులు.. అతని స్నేహితుడి మీద నిఘా పెట్టి.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

సీసీ కెమేరా ఫుటేజ్ ను పరిశీలించినప్పుడు రాజు ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ వైపునకు వెళ్లినట్లుగా గుర్తించారు. సైదాబాద్ నుంచి ఎల్ బీ నగర్ కు వెళ్లే వేళలో.. అతనితో పాటు.. అతని స్నేహితుడు కూడా వెంట ఉన్నట్లు పోలీసులు గుర్తించి.. అతన్ని అదపులోకి తీసుకున్నారు. అయితే.. తనకు హత్యాచారం గురించి ఎలాంటి సమాచారం తెలీదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎల్ బీ నగర్ నుంచి ఉప్పల్ వైపునకు ఒంటరిగా వెళుతున్న రాజు.. ఆ తర్వాత ఘట్ కేసర్ కు వెళ్లినట్లుగా అంచనా వేస్తున్నారు.

ఏమైనా.. మహానగరంలోనే రాజు ఉండి ఉంటాడని భావిస్తున్నారు. తాము అదుపులోకి తీసుకున్న రాజు స్నేహితుడ్ని.. తమదైన శైలిలో పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో.. రాజుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలవటం ఖాయమని.. దీంతో అతన్ని పట్టుకోవటం తేలిక అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా నిందితుడు రాజు కోసం హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News