• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ర‌జ‌నీ బెద‌రించినా...

ర‌జ‌నీ బెద‌రించినా స‌రే...ఐపీఎల్ ఆడిస్తాం

By - Tupaki Desk
Update: 2018-04-09 17:49 GMT
త‌మిళనాడు రాష్ట్రంలో మ‌రో కొత్త వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. తమిళనాడు వ్యాప్తంగా కావేరీ జలాల విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే.  ఏప్రిల్ 10న చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతుండ‌టంపై నీలినీడలు క‌మ్ముకున్నాయి. తాజా ఆందోళ‌న‌ల నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, ఐపీఎల్ మ్యాచ్‌ లు నిర్వహించవద్ద‌న్న వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో చెన్నైలో ఐపీఎల్ నిర్వహణ సరికాదని సూపర్‌ స్టార్ రజనీకాంత్ కూడా అన్నారు. కావేరీ యాజమాన్య బోర్డును ఏర్పాటుచేయడంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా చెన్నైలో తమిళ సినీ ప్రముఖులు మౌన నిరసన చేపట్టారు. తమిళ చిత్ర నిర్మాతల మండలి(టీఎఫ్‌పీసీ) - సౌత్ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్(ఎస్ఐఏఏ) - దక్షిణభారత సినీ ఉద్యోగుల సంస్థ - డిస్ట్రిబ్యూటర్ల సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం వల్లువర్కొట్టమ్‌ లో మౌనంగా నిరసన తెలిపారు. రసనలో నటుడు కమల్‌ హాసన్‌ తో కలిసి పాల్గొన్న రజినీకాంత్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితి గురించి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీ ఆలోచించాలి. చెన్నైలో ఐపీఎల్ నిర్వహణకు ఇది సమయం కాదన్న వాస్తవాన్ని గుర్తించాలి అని చెప్పారు.

దీనిపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఐపీఎల్ ర‌ద్దు చేసే అయితే అలాంటి ఆలోచన ఏమీ లేదని స్పష్టంచేశారు. మంగళవారం చెన్నై, కోల్‌కతా మ్యాచ్ కూడా చెన్నైలోనే జరుగుతుందని ఆయన చెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడామని, తగిన భద్రత కల్పిస్తామని వాళ్లు హామీ ఇచ్చినట్లు శుక్లా తెలిపారు. `చెన్నై మ్యాచ్‌ను తరలించలేదు. ఏప్రిల్ 10న చెన్నైలోనే ఆ మ్యాచ్ ఉంటుంది. తగిన భద్రత కల్పిస్తామని అధికారులు చెప్పడంతో అక్కడే మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించాం. దయచేసి ఐపీఎల్‌ను రాజకీయ వివాదాల్లోకి లాగొద్దు` అని శుక్లా అన్నారు.

కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా కొన్ని రోజులుగా తమిళనాడులో ఆందోళనలను మిన్నంటుతున్నాయి. సినిమా స్టార్లు కూడా ఈ నిరసనల్లో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఐపీఎల్ నిర్వహణను కమల్‌హాసన్ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. నటి కుష్బు, నటులు విశాల్, విజయ్, ధనుష్, కార్తి, సత్యరాజ్, దర్శకులు శంకర్ - విక్రమన్ - సంగీత దర్శకుడు ఇళయరాజా తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమిళ రైతులకు అప్పులు పెరిగి - ఆకలితో అలమటిస్తుంటే.. ఐపీఎల్ నిర్వహిస్తుండటాన్ని అధికార ఏఐఏడీఎంకేతోపాటు ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు.

Tags:    
  • Rajnikanth 
  • CSK players 
  • IPL 2018 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS