సూపర్, పవర్ స్టార్ల రాజకీయాలు వేరయా

Update: 2020-02-07 13:30 GMT
రాజకీయమనేది అందరికీ అచ్చి రాదు. సినిమాలు చేసినంత ఈజీగా రాజకీయాల్లో రాణించలేం. అందరూ జయలలిత, ఎన్టీఆర్ మాదిరి కాలేరు. మంచిగా సినిమాలు చేసుకుంటున్న సమయంలోనే రాజకీయాలపై దూకిన ఎందరో నటీనటుల్లో కొందరు క్లికయ్యారు.. మరికొందరు విఫలమయ్యారు. సినిమాల్లో నటించినట్టు రాజకీయాల్లో నటించాలనుకుంటే సాధ్యం కాని పని. ఇలా చేసి ఎంతో మంది తమ భవిష్యత్ ను కోల్పోయిన సంఘటనలు చూసే ఉన్నాం. అయితే ఇప్పుడు దక్షిణాదిలో ఇద్దరు స్టార్ నటుల రాజకీయం గందరగోళంగా ఉంది. ఒక స్టార్ పార్టీ స్థాపించి ఆరేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదు. ఇంకో స్టార్ నటుడు రాజకీయాల్లోకి వస్తానని చెబుతూ ఊరిస్తున్నాడే తప్ప వచ్చింది లేదు చేసింది లేదు. కానీ సమకాలీన అంశాలపై మాట్లాడుతూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. వారిద్దరే తెలుగు నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్, తమిళ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్. వీరిద్దరూ రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోతున్నారు. ఎంతోమంది అభిమానం సంపాదించుకున్న రజనీకాంత్, పవన్‌ కల్యాన్ రాజకీయ రంగంలో హీరో కాలేకపోతున్నారు. జనసేన పేరుతో పవన్ కల్యాణ్‌ పార్టీ పెట్టి రాజకీయ కమెడియన్ అయ్యారు. తమిళనాడులో రజనీకాంత్ పార్టీ పెట్టాలని ఉన్నా ముందడుగు వేయలేకపోతున్నారు. అయితే వీరిద్దరి మధ్య మాత్రం కొన్ని సారూప్యతలు ఉన్నాయి.

ఇద్దరు రాజకీయాల్లోకి ఒకే సమయంలో రావాలనుకున్నారు. పవన్ వచ్చాడు.. రజనీ ఇంకా వచ్చే దశలోనే ఉన్నాడు. వీరిద్దరూ ప్రజా సమస్యల పై మాట్లాడడం వదిలేసి ఏదో గాలికి తోచింది.. అనవసర అంశాలు పట్టుకుని వేలాడుతుంటారు. అందులో భాగంగానే రజనీకాంత్ పెరియార్ రామస్వామి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో పవన్ కల్యాణ్ అధికారంలో లేని జగన్ ను విమర్శించి అభాసుపాలు కాగా దానికి మూల్యం ఎన్నికల్లో చెల్లించుకున్నాడు. ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీతోనే అకస్మాత్తుగా పొత్తు పెట్టుకుని అందర్నీ షాక్ కు గురి చేశాడు. ఆ పొత్తు ఎందుకు చేసుకున్నాడో అతడికే తెలియాలి. ఇక పవన్ కు తోడుగా రజనీకాంత్ వంత పాడుతున్నాడు. ఇటీవల సీఏఏ కు మద్దతు గా మాట్లాడారు. తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ పౌరసత్వ సవరణ చట్టానికికు మద్దతిచ్చారు. సొంత రాష్ట్రాల్లో, సరికొత్త చర్చకు తెరలేపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ఏపీలోని వైఎస్సార్సీపీ, తమిళనాడులోని ప్రధాన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ సమయంలో ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు సొంత రాష్ట్రంలో ఇరుకున పడేలా నిర్ణయాలు తీసుకున్నారు. వారికి తెలిసో.. తెలియకో ఈ నిర్ణయాలు తీసుకుని బీజేపీ పంచాన చేరారు.

దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన పౌరసత్వ సవరణ చట్టంపై రజనీ తొలిసారి స్పందించి వాటికి మద్దతుగా మాట్లాడడంతో విపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీ చెంతన చేరడం కోసమే రజినీ తహతహలాడుతున్నాడని విమర్శలు చేశాయి. పవన్‌ కల్యాణ్‌, రజనీకాంత్ దక్షిణాదిని ప్రేక్షకాదరణ ఉన్న వారు. వీరి ద్వారా దక్షిణ భారతదేశంలో కొంత స్థిరపడాలని బీజేపీ ఉబలాటపడుతోంది. అయితే ఈ నిలకడ లేని స్టార్ రాజకీయ నాయకులను నమ్మి బీజేపీ పటిష్టం పక్కన పెడితే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. రజినీకాంత్, పవన్‌ అదే పనిగా బీజేపీ ప్రభుత్వం మీద ప్రశంసలు, హిందూత్వ భావజాలంలో మాట్లాడటం వంటి వాటితో తమ రాజకీయ ఎదుగుదల సాధ్యమని పవన్, రజనీ భావిస్తున్నారు.



Tags:    

Similar News