మళ్లీ పొలిటికల్ ఎంట్రీ పై నోరు విప్పిన రజిని .. ఏంచెప్పారంటే

Update: 2021-07-12 07:02 GMT
గతకొద్ది రోజుల ముందు అంటే ..  తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళ రాజకీయాలలో సంచలనంగా మారిన ఏకైక వార్త రజిని పొలిటికల్ ఎంట్రీ , మొదట తాను రాజకీయ ఆరంగేట్రం చేస్తానని ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్య కారణాలతో రాజకీయాల నుండి పూర్తిగా పక్కకి తప్పుకుంటున్నట్టు ఓ  ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్టివ్ పాలిటిక్స్ కోసం ఎంతగానో ఎదురు చూసిన ఆయన అభిమానులు ఆయన రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటన నేపథ్యంలో ఎంతో  నిరాశకు గురయ్యారు. ఇక ఇదిలా ఉంటే .. తాజాగా మరోసారి తమిళనాడు రాజకీయాల్లో రజినీకాంత్ పొలిటికల్  రీఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. తమిళనాడులోని అభిమాన సంఘాలతో సూపర్ స్టార్ రజినీకాంత్ సమావేశం కావడం ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చకు కారణమైంది.

సూపర్ స్టార్  రజనీకాంత్ మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారా, ఆయన ఈసారి ఫుల్ టైమ్ పాలిటిక్స్ లో కొనసాగాలని డిసైడ్ అయ్యారా అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. అలాగే ఇదే తరుణంలో  రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన పొలిటికల్ రీ ఎంట్రీపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. తాను రాజకీయాల్లోకి రానని ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్న రజనీకాంత్ వ్యాఖ్యలు  ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. మక్కల్ మండ్రం ఆఫీస్ బేరర్ లతో సమావేశం కానున్న సమయంలో  తాను రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్నదానిపై చర్చిస్తానని పేర్కొనడం ఇప్పుడు రజనీకాంత్ పొలిటికల్ జర్నీ పై మరోమారు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే రజనీకాంత్ ని పాలిటిక్స్ లోకి రావాలని చాలామంది అడిగిన నేపథ్యంలో తాజాగామరోసారి ఆయన అభిమానులతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది .. రజనీకాంత్ మక్కల్ మండ్రం ఆఫీస్ బేరర్ లతో నేడు సమావేశం నిర్వహించడం కోసం ఇప్పటికే అన్ని జిల్లాల నాయకులకు ఆహ్వానం పంపించారు.
Read more!

ఇక అభిమాన సంఘాల నాయకులు సైతం ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా రజినీకాంత్ మరోమారు అభిమాన సంఘం నేతలను కలుస్తున్న నేపథ్యంలో శుక్రవారం చెన్నై కి చేరుకున్నారు. అనారోగ్య కారణాలతో ఇటీవల అమెరికా వెళ్ళిన రజనీకాంత్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి చెన్నైకి చేరుకున్న నేపథ్యంలో జరుగుతున్న తాజా సమావేశం ఆసక్తికరంగా మారింది. 70 ఏళ్ల వయసులో రాజకీయ పార్టీని ప్రారంభించాలని గత డిసెంబర్లో ప్రయత్నం చేసిన రజనీకాంత్ అనారోగ్య కారణాలతో తాను రాజకీయాల్లోకి రాలేకపోతున్నానని ప్రకటన చేశారు. రాజకీయాల్లో లేకుండానే తాను ప్రజలకు సేవ చేస్తానని, తన నిర్ణయం తన అభిమానులకు బాధ కలిగించినా తప్పనిసరి పరిస్థితుల్లో తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, దయచేసి అందరూ తనను క్షమించాలని రజనీకాంత్ ప్రకటన చేశారు. అప్పుడు రజనీకాంత్ చేసిన ప్రకటనతో రజనీ రాజకీయ ప్రవేశానికి తెర పడినట్లేనని అందరూ భావించారు. అయితే , తాజాగా రజనీకాంత్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో మరోమారు దుమారం మొదలైంది.   రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావాలి అనుకున్నాను. కానీ అందుకు సరైన సమయం కుదరలేదు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. అందువల్ల నేను విన్నవించుకుంటున్నాను. ఇకపై రజనీ మక్కల్ మంద్రం... అభిమానుల చారిటీ ఫోరమ్‌లా పనిచేస్తుంది. ఇది ప్రజలకు మేలు చేస్తుంది" అని రజనీకాంత్ తన స్టేట్‌మెంట్‌లో తెలిపారు. ప్రస్తుతానికి ఈ సంస్థలోని సెక్రెటరీలు, అసోసియేట్లు, డిప్యూటీ సెక్రెటరీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు... అందరూ పనిచేస్తూనే ఉంటారని రజనీ తెలిపారు. చూడాలి మరి పొలిటికల్ ఎంట్రీ పై సూపర్ స్టార్ ఈసారి ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో ..
Tags:    

Similar News