సూపర్ స్టార్ ఎంట్రీతో ఎన్నికలు వారి మధ్యనేనట

Update: 2020-12-04 04:30 GMT
సూపర్ స్టార్.. ఎట్టకేలకు తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో.. ఈ మాట కోసం ఎదురుచూస్తున్న రజనీకాంత్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఈ ఏడాది చివరి రోజున అంటే.. డిసెంబరు 31న తన రాజకీయ పార్టీ వివరాల్ని.. కార్యాచరణను వెల్లడిస్తానని రజనీ ఇప్పటికే చెప్పటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాజకీయ సంచలనం.. తరచూ తన మాటలతో హాట్ టాపిక్ గా మారే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి ఆసక్తికర ట్వీట్ చేశారు.వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలు రజనీ నిర్ణయంతో మారినట్లుగా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తమిళనాడు ఎన్నికలు రజనీ వర్సెస్ చిన్నమ్మ శశికళ మధ్యనే జరుగుతాయని జోస్యం చెప్పారు.

రజనీ తాజా నిర్ణయంతో బీజేపీ డైలమాలో పడిందని.. తన పొలిటికల్ ఎంట్రీ విషయంలో రజనీ నోటి నుంచి వచ్చిన మాట ఆసక్తికరంగానే కాదు.. దేశ వ్యాప్తంగా చర్చకు తెర తీసినట్లు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న డీఎంకేను స్వామి పరిగణలోకి తీసుకోవటం గమనార్హం. ఇప్పటివరకు డీఎంకే.. అన్నాడీఎంకే మధ్య పోటీ ఉంటుందని.. జైలు నుంచి విడులయ్యే శశికళ.. ఎన్నికల్లో పెద్ద పాత్రను పోషించరన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ.. అందుకు భిన్నంగా స్వామి ట్వీట్ ఉండటం గమనార్హం.
Tags:    

Similar News