చంద్రబాబు బాటలో రాజస్థాన్ సీఎం.. సీబీఐకి చెక్
రాజస్థాన్ లో సచిన్ పైలెట్ తిరుగుబాటుతో అతికష్టం మీద ప్రభుత్వాన్ని కాపాడుకున్న కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ బీజేపీకి షాకిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఇటీవలే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పై ఎమ్మెల్యేలను లోబరుచుకున్నట్టున్న ఆడియో టేపులు రిలీజ్ చేసి కలకలం రేపింది. ఆడియో టేపుల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
సీబీఐ దర్యాప్తులను రాజస్థాన్ రాష్ట్రంలో నిషేధిస్తూ ఆ రాష్ట్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సీఎం అశోక్ గెహ్లాట్ కేంద్రానికి చెక్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ అధికారులు రాజస్థాన్ రాష్ట్రంలో విచారణ జరపలేరు. ఆడియో టేపులపై విచారణకు సిద్ధం అవుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు అశోక్ గెహ్లాట్ షాకిచ్చారు.
ఇదివరకు ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉండగా.. కేంద్రంలోని ఎన్టీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పుడు టీడీపీ నాయకులపై సీబీఐ.. ఐటీ దాడులు జరిగాయి. అప్పుడు చంద్రబాబు సైతం సీబీఐపై ఏపీలో నిషేధం విధించారు. తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా అదే బాటలో నడిచారు. కేంద్రంలోని దర్యాప్తు సంస్థలతో బీజేపీ బెదిరింపులకు లొంగమని వాటిని రాష్ట్రంలో నిషేధించారు.
ఇప్పటికే పశ్చిమ బెంగాల్, చత్తీస్ ఘడ్ ప్రభుత్వాలు సీబీఐని ఆ రాష్ట్రాల్లో నిషేధించాయి. ఇప్పుడు అదే జాబితాలో రాజస్థాన్ కూడా చేరింది. ఏపీలో కూడా నిషేధించినా వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని తొలగించింది.