ఫేస్ బుక్ ఎంగేజ్ మెంట్స్ లో మోడీ కన్నా రాహుల్ టాప్

Update: 2020-10-05 13:00 GMT
భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇటు మీడియాలోనూ అటు సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువన్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యధిక మంది ఫాలోవర్లున్న దేశాధినేతల్లో మోడీ ఒకరు. మోడీకి 45.9 మిలియన్ ఫాలోవర్లున్నారు. ఇక, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 3.5 మిలియన్ ఫాలోవర్లున్నారు. అయితే, హథ్రాస్ ఘటన నేపథ్యంలో రాహుల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. దీంతో,  మోడీ ఫేస్ బుక్ పేజ్ కంటే రాహుల్ ఫేస్ బుక్ పేజీకి 40శాతం ఎక్కువ ఎంగేజ్‌మెంట్ వచ్చింది. సెప్టెంబర్ 25నుంచి అక్టోబర్ 2వరకూ తీసుకున్న డేటా ప్రకారం ఈ ఎంగేజ్ మెంట్ విషయంలో మోడీని మించిపోయారు రాహుల్. కాంగ్రెస్ డేటా ఆధారంగా చూసుకుంటే గత వారం ఎంగేజ్మెంట్ 8.2 మిలియన్ మాత్రమే.  

ఫేస్ బుక్ ఎనాలిటిక్స్ ప్రకారం కాంగ్రెస్ 5 ఫేస్ బుక్ పేజీలను నిర్వహిస్తోంది. వాటిలో రాహుల్ గాంధీ పోస్టులతో 13.9మిలియన్ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయని, కామెంట్లు, లైకులు, షేర్ల వల్లే వచ్చాయని ఫేస్ బుక్ తెలిపింది. ఇక, బీజేపీ అఫీషియల్ పేజ్‌ కు 16మిలియన్ ఫాలోవర్లు ఉండగా, ఆ తేదీల్లో 2.3 మిలియన్ ఎంగేజ్ మెంట్స్ వచ్చాయి. కాంగ్రెస్ అఫీషియల్ పేజ్ కు 5.6మిలియన్ మంది ఫాలోవర్లు ఉండగా 3.6మిలియన్ ఎంగేజ్ మెంట్స్ వచ్చాయి. యూఎన్ జనరల్ అసెంబ్లీ వంటి ఈవెంట్లకు అటెండ్ అయిన మోడీ సెప్టెంబర్ 25నుంచి అక్టోబర్ 2వరకూ 11సార్లు మాత్రమే పోస్టు చేశారు. హథ్రాస్ ఘటన , ఖేతీ బచావోలపై ఫేస్ బుక్ లో రాహుల్ పెట్టిన పోస్టుల వల్లే మోడీ కన్నా రాహుల్ కు ఎక్కువ ఎంగేజ్ మెంట్స్ వచ్చాయి. దీంతోపాటు, కొవిడ్ 19 సంక్షోభం దేశ ఎకానమీపై చూపి ప్రభావం వంటి అంశాలపై రాహుల్ పోస్ట్ చేసిన వీడియోలు కూడా ఈ ఎంగేజ్ మెంట్స్ కు కారణం. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్న రాహుల్....ఇపుడు ఈ స్థాయిలో ఎంగేమెంట్లు తెచ్చుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. మరి, సోషల్ మీడియాలో ఇదే ఊపును రాహుల్ కొనసాగిస్తారా...మోడీ తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటారా అన్నది తెలియాలంటే మరి కొంతకాలం వేచిచూడక తప్పదు.
Tags:    

Similar News