యువరాజు మాంచి దూకుడుమీద ఉన్నారే
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాంచి దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల సింగిల్ లైన్ ట్వీట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రాహుల్ ఫైరవుతున్న విషయం తెలిసిందే. ఇదే కోణంలో ఇవాళ మరో ట్వీట్ చేసి ప్రధాని మోడీని మళ్లీ టార్గెట్ చేశారు. గత కొన్ని రోజులుగా సిక్కిం రాష్ట్రంలో ఉన్న డోకలామ్ బోర్డర్ దగ్గర చైనాతో వివాదం ఏర్పడింది. భారత్ ను బెదిరిస్తూ చైనా మీడియా రాస్తున్న కథనాల పట్ల ఇప్పటి వరకు భారత ప్రధాని స్పందించలేదు. దీంతో ఆ అంశాన్ని ఇవాళ రాహుల్ తన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. చైనాతో ఉన్న బోర్డర్ టెన్షన్ పై ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ ప్రశ్నించారు.
అమెరికా పర్యటనలో మోదీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఫొటోలు దిగడం తప్ప సాధించిందేమీలేదంటూ ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. ఇద్దరూ కలిసి ఫొటోలకు ఫోజులివ్వడం ద్వారా అసలు సమస్యలను పక్కదారి పట్టించారని ఆరోపించారు. ట్రంప్‌తో భేటీ సందర్భంగా హెచ్-1బీ వీసా సమస్యలపై ప్రస్తావించి పరిష్కారం చూపుతారని ఐటీ పరిశ్రమ ఎదురుచూసిందని, కానీ ఆ వైపు కనీసం దృష్టికూడా సారించలేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పాకిస్థాన్ కు చెందిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థ చీఫ్ సలాహుద్దీన్ ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే సమయంలో చేసిన భారత పాలనలోని కశ్మీర్ వ్యాఖ్యపై మోడీ స్పందించకపోవడం దారుణమన్నారు. దీంతో పరోక్షంగా అమెరికా వ్యాఖ్యలను ఒప్పుకుంటున్నట్టు స్పష్టమైందని పేర్కొన్నారు.మొన్న కూడా రాహుల్ తన ట్విట్టర్ లో ప్రధాని మోడీని బలహీన వ్యక్తిగా అభివర్ణించారు.