ఓటమి బాటలో రాహుల్!...ముందే గ్రహించారా?
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి తన సొంత నియోజకవర్గం అమేథీలో భారీ షాక్ తగిలే అవకాశాలే కనిపిస్తున్నాయి. గాంధీ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న అమేథీలో ఇప్పటిదాకా రాహుల్ గాంధీ మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. అంతకుముందు ఆయన తల్లి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా ఈ నియోజకవర్గం నుంచి ఓ పర్యాయం విజయం సాధించారు. అయితే నేటి ఉదయం ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్ లో ఆది నుంచి రాహుల్ గాంధీ వెనుకంజలోనే ఉన్నారు. రాహుల్ గాంధీ ఓటమే లక్ష్యంగా సాగిన బీజేపీ... అక్కడ తన అభ్యర్థిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని దింపింది.
గడచిన ఎన్నికల్లో రాహుల్ కు ముచ్చెమటలు పట్టించిన ఇరానీ... ఈ దఫా ఏకంగా రాహుల్ ను ఓడించే స్థాయికి ఎదిగారు. నియోజకవర్గంలో నిత్యం పర్యటనలు సాగించిన స్మృతి... అక్కడి ప్రజలతో మమేకమయ్యారనే చెప్పాలి. స్మృతి దూకుడును ముందుగానే గ్రహించిన రాహుల్ తనకు ఈ దఫా ఓటమి తప్పదా? అన్న భావనకూ వచ్చేశారన్న వాదన వినిపిస్తోంది. ఈ భయం కారణంగానే ఆయన ఎన్నడూ లేని విధంగా దక్షిణాది వైపు దృష్టి సారించి కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగారన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా అమేథీలో రాహుల్ గాంధీ ఓడితే మాత్రం.. ఈ ఎన్నికల్లో ఇదే అత్యంత సంచలన విషయంగా చెప్పక తప్పదు.