రాహుల్ రాజ‌వంశీకుడు..నేను శ్రామికుడిని:మోదీ

Update: 2018-05-01 11:55 GMT
త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతోన్న కర్ణాటక శాసన సభ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. క‌ర్ణాట‌క‌లో బీజేపీకి పూర్వ‌వైభ‌వం తేవాల‌ని బీజేపీ....అధికారాన్ని నిల‌బెట్టుకోవాల‌ని కాంగ్రెస్ ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క‌లో నేడు ప‌ర్య‌టిస్తోన్న  ప్రధాని మోదీ....ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ పై నిప్పులు చెరిగారు. రాహుల్ కు నిజంగా దమ్ముంటే 15 నిమిషాల పాటు న‌చ్చిన భాష‌లో అన‌ర్గ‌ళంగా మాట్లాడాలని స‌వాల్ విసిరారు. క‌ర్ణాట‌క‌లోని ప్ర‌ముఖుల పేర్లు ప‌ల‌క‌డం కూడా రాని రాహుల్ ...త‌న‌ను విమ‌ర్శించ‌డం హాస్యాస్పద‌మ‌న్నారు. రాహుల్ రాజ‌వంశానికి చెందిన వ్య‌క్త‌ని...ఆయ‌న ముందు కూర్చోవ‌డానికి త‌న‌కున్న అర్హ‌త ఏమిట‌ని మోదీ ఎద్దేవా చేశారు. క‌ర్ణాట‌క‌ను అభివృద్ధి చేయ‌డంలో  కాంగ్రెస్ విఫ‌ల‌మైంద‌ని మండిప‌డ్డారు.

తాను 15 నిమిషాలపాటు మాట్లాడితే మోదీ త‌న ముందు నిలబడలేర‌ని రాహుల్ అన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై మోదీ ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ....ఇంగ్లిష్, హిందీ....ఏ భాష‌లో అయినా అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌వ‌చ్చ‌ని...అయితే, కాగితం మీద రాసుకోకుండా 15 నిమిషాలపాటు గడగడ మాట్లాడాల‌ని స‌వాల్ విసిరారు. గత ఐదేళ్ళలో కాంగ్రెస్ సాధించిన విజయాల గురించి మాట్లాడాల‌ని, అపుడు విజేత‌ల‌ను ప్రజలు  నిర్ణయిస్తార‌ని మోదీ అన్నారు. కన్నడ ప్రముఖుల పేర్లు కూడా రాహుల్ స‌రిగా ప‌ల‌క‌లేర‌ని,బసవేశ్వర, విశ్వేశ్వరయ వంటి పేర్లను పలికేట‌పుడు ఇబ్బంది ప‌డ్డార‌ని చెప్పారు. రాహుల‌్ రాజవంశీకులని, త‌ర‌త‌రాలుగా పేరును మోసుకువ‌స్తున్నార‌ని ఎద్దేవా చేశారు. తాను శ్రమించేవాడినని, రాహుల్  ముందు కూర్చోవడానికి త‌న‌కు అధికారం లేద‌ని చ‌మ‌త్క‌రించారు. ఏప్రిల్ 28వ తేదీన దేశం గర్వించదగిన రోజు అని, దేశంలోని 5.97 లక్షల గ్రామాలకు విద్యుత్ సరఫరాను కేంద్రం కల్పించిందని మోదీ చెప్పారు.
Tags:    

Similar News