ప్రమాణ స్వీకారంలోనూ పరధ్యానమా రాహుల్!
దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలని రాహుల్ గాంధీ పరితపించాడు. అయితే ప్రజలు మాత్రం ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆయన ఒట్టి ఎంపీగా మాత్రమే మిగిలారు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేసినట్టో - చేయనట్టో ఎవరికీ తెలియదు కూడా!
ఆ సంగతలా ఉంటే.. లోక్ సభలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాహుల్ చాలా పరధ్యానంతో వ్యవహరించారు. వయనాడ్ నుంచి ఎంపీగా నెగ్గిన ఆయన ఆ బాధ్యతలు స్వీకరిస్తూ సాటి ఎంపీలతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం - ఎంపీలు సంతకం చేసి వెళ్లి తమ తమ సీట్లలో కూర్చోవాలి. అదే నియమం.
అయితే ప్రమాణ స్వీకారం చేసిన రాహుల్.. సంతకం చేయడం మాత్రం మరిచిపోయారు. ప్రమాణ స్వీకారం చేసి వెళ్లి తన సీట్లో కూర్చోబోయారు. ఆయన అలా వెళ్లిపోతుంటే.. అక్కడే ఉన్న అధికారులు - కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ కు సంతకం విషయాన్ని గుర్తు చేశారు. సంతకం మరిచిపోయారనే అంశాన్ని ఆయన చేత సంతకం చేయించారు!
ఆ పని పూర్తి చేసి.. సొంత పార్టీ ఎంపీల - తల్లి సోనియాగాంధీ అభినందనల మధ్యన రాహుల్ వెళ్లి తన సీట్లో కూర్చున్నారు. అయినా ప్రమాణస్వీకారం రోజే రాహుల్ కు ఈ పరధ్యానం ఏమిటో రాహుల్ గాంధీకి!