• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాక్‌ను...

పాక్‌ను విమ‌ర్శిస్తే...రాహుల్ హ‌ర్ట‌య్యాడు!

By - Tupaki Desk
Update: 2016-12-12 04:49 GMT
పాకిస్తాన్ ను విమ‌ర్శిస్తే ఆ దేశం కంటే ముందు కాంగ్రెస్ పార్టీ బాధ‌ప‌డుతుంద‌ని బీజేపీ త‌ర‌చుగా ఎద్దేవా చేయ‌డంలో నిజం ఉంద‌నే రీతిలో రాహుల్ గాంధీ ప్ర‌వ‌ర్తించారు. మతప్రతిపాదికన భారత దేశాన్ని విభజించడానికి పాకిస్థాన్ కుట్ర చేస్తున్నదని, అది ఎన్నటికీ నెరవేరదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం కథువా జిల్లాలో జరిగిన షహిదీ దివస్‌లో రాజ్‌నాథ్‌సింగ్ ఈ కామెంట్లు చేయ‌గా...కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా అదే పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

జ‌మ్ముకాశ్మీర్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ ఉగ్రవాదం ద్వారా భారత్ నుంచి జమ్ముకశ్మీర్‌ను వేరు చేయాలని పాకిస్థాన్ చూస్తుందన్నారు. పిరికి వారి ఆయుధం ఉగ్రవాదమని, అది ధైర్యవంతుల లక్షణం కాదన్నారు.మత ప్రతిపాదికన మళ్లీ ఒక్కసారి దేశం విభజనకు గురికాదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఉగ్రవాదాన్ని అరికట్టడంలో విఫలమైతే, పాకిస్థాన్ 10దేశాలుగా ముక్కలవుతుందని హోంమంత్రి హెచ్చరించారు. స్నేహ హస్తం అందిస్తే యురి, గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడుల రూపంలో బదులు ఇచ్చిందని పేర్కొన్నారు. పాకిస్థాన్ పదేపదే దాడులకు తెగబడుతున్నా భారత్ ఎప్పుడూ మొదట కాల్పులు జరుపలేదని హోం మంత్రి అన్నారు. ఉగ్రవాదాన్ని నియంత్రించడం పాకిస్థాన్‌కు చేతకాకపోతే, ఆ దేశం కావాలనుకుంటే భారత్ సహాయం అందిస్తుందని ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రం అనంతరం పాకిస్థాన్ నాలుగుసార్లు యుద్ధానికి దిగిందని, ప్రతిసారి భారత సైన్యం సరైన గుణపాఠం నేర్పించదన్నారు.

అయితే దీనిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. మతప్రతిపాదిక భారత దేశ విభజనకు పాకిస్థాన్ కుట్ర చేస్తుందన్న అంశాన్ని తాను అంగీకరిస్తానని తెలిపారు. కానీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా అదే పని చేస్తున్నారని విమ‌ర్శించారు.
Tags:    
  • Rahul Gandhi 
  • Rajnath Singh 
  • BJP 
  • Telugu News 
  • AP Politics 
  • AP Political News 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS