ఈసీ అంబాసిడర్, మాజీ క్రికెటర్ ఓటే గల్లంతు!

Update: 2019-04-14 10:23 GMT
కర్ణాటక ఎన్నికల అంబాసిడర్, భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రావిడ్‌ ఓటు గల్లంతయింది. తాజాగా విడుదల చేసిన ఓటరు జాబితాలో ద్రావిడ్‌తో పాటు ఆయన భార్య పెండార్కర్‌ పేరు కూడా లేదు. ఈనెల 18వ తేదీ కర్ణాటకలో జరిగే తొలివిడత ఎన్నికల్లో ఆయన ఓటుహక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఓటరు జాబితాలో పేరు లేనప్పటికీ ఆయన తిరిగి నమోదు చేసుకోలేదు. ఎన్నికల అంబాసిడర్‌ అయి ఉండీ ఓటు వినియోగించుకోవడం గమనార్హం.

ఆయన ఇటీవల ఇందిరానగర్‌ నుంచి అశ్వర్థనగర్‌ కు మకాం మార్చారు. సోదరుడు విజయ్‌ ఓటరు జాబితాలో చిరునామా మార్చాలనే బదులు శాంతినగర్‌ ఓటరు జాబితా నుంచి రాహుల్‌ ద్రావిడ్‌ పేరును తొలగించాలని దరఖాస్తు చేశారు. ఫలితంగా రాహుల్‌ ద్రావిడ్‌ ఈసారి తన ఓటును వినియోగించుకోలేని పరిస్థితి. బీఎల్‌ఓ ఇందిరానగర్‌లో గతంలో రాహుల్‌ద్రావిడ్‌ ఉన్న ఇంటిని సంప్రదించారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో నిర్ధారణకు వచ్చి ద్రావిడ్‌తో పాటు భార్య విజేత పేరు కూడా తీసేశారు.

ద్రావిడ్‌ గతంలో ఉన్న ఇళ్లు శాంతినగర్‌ అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గం కింద ఉంటుంది. రాహుల్‌ ద్రావిడ్‌ ప్రతి సారి తన ఓటును వినియోగించుకునే వారు. ఈ క్రమంలో రాజకీయాలకు అతీతంగా ఉన్న సెలబ్రిటీ కావడంతో ఎన్నికల సంఘం గుర్తించి ప్రచార అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. అయితే ఈసారి తన ఓటును వినియోగించుకోలేని పరిస్థితి.
 
Tags:    

Similar News