కేంద్రాన్ని 3 ప్రశ్నలు వేసిన రాహుల్
దేశవ్యాప్తంగా పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులను పరిష్కరించే వ్యూహం ప్రణాళిక కేంద్రం వద్ద లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగించే మందుల కొరతను తీర్చడానికి ఏం చేస్తున్నారో చెప్పాలని రాహుల్ గాంధీ కేంద్రాన్ని నిలదీశారు. ట్విట్టర్ ద్వారా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ కేంద్రాన్ని 3 ప్రశ్నలు అడిగారు. దేశంలో బ్లాక్ ఫంగస్ పై వాడే యాంఫోటెరిసిస్ బి ఔషధ కొరత కోసం ఏం చేస్తున్నారని మొదటి ప్రశ్నగా రాహుల్ అడిగారు. ఇక రోగికి ఈ ఔషధం తీసుకునే విధానం ఏమిటని ప్రశ్నించారు. ఇక మూడోది చికిత్స ఇవ్వడానికి బదులుగా ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటూ మూడు ప్రశ్నలు సంధించారు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలోనే రోగులను బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ అంటుకుంటోంది. రాష్ట్రాల్లో ఈ కేసులు బాగా పెరుగుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, తమిళనాడు, బీహార్ సహా అనేక రాష్ట్రాలు అంటువ్యాధి చట్టం, 1987 ప్రకారం బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధిగా ప్రకటించాయి.బ్లాక్ ఫంగస్ సమస్య కోవిడ్ 19 వచ్చాక వస్తోందని.. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులలో ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా గుర్తించారు.