ర‌ఘువీరా.. విల్లు ఎక్కు: ఇక ముందుకేనా!

Update: 2017-10-07 17:30 GMT
విభ‌జ‌న నేప‌థ్యంలో పూర్తిగా చ‌తికిల ప‌డిన ఏపీ కాంగ్రెస్ పున‌రుజ్జీవ‌నం దిశ‌గా అడుగులు వేస్తోందా?  ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న నేత‌లు ఒక తాటిపైకి వ‌స్తున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్‌ కు బ‌లం చేకూర్చ‌నున్నారా?  అన్ని హంగుల‌తోనూ స‌ర్వం సిద్ధం అవుతున్నారా? అంటే తాజాగా జ‌రిగిన ప‌రిణామాలు ఔన‌నే స‌మాధాన‌మే ఇస్తున్నాయి. నిజానికి విభ‌జ‌న దెబ్బ‌కి కాంగ్రెస్ పూర్తిగా దెబ్బ‌తినేసింది. నేత‌లు డిపాజిట్లు సైతం కోల్పోయారు. దీంతో కాంగ్రెస్ ప‌రిస్థితి ఏపీలో ఇక బాగుప‌డ‌ద‌ని నేత‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు.

అయితే, అనూహ్యంగా ఇటీవ‌ల జ‌రిగిన నంద్యాల ఉప పోరు - కాకినాడ కార్పొరేష‌న్ ప‌రిస్థితులు 2014తో పోల్చుకుంటే మెరుగు ప‌డ్డాయ‌ని నేత‌లు గుర్తించారు. దీంతో వారు త‌మ ప‌రిస్థితి ముందు ముందు బాగుంటుంద‌ని అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌ ను మ‌రింత బ‌లంగా ముందుకు తీసుకు వెళ్లి.. పార్టీకి పున‌ర్ వైభ‌వం తెచ్చే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా శ‌నివారం అనంత‌పురం జిల్లా క‌ళ్యాణదుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో నేత‌లు భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఏపీసీసీ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించింది. ఈ సమావేశంలో విల్లును ఎక్కుపెట్టి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అల‌రించారు. కార్య‌క్ర‌మంలో ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి - రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగ గౌతమ్ - డీసీసీ అధ్యక్షుడు కోట సత్యం - కల్యాణ దుర్గం మండల అధ్య‌క్షుడు - పట్టణ అధ్యక్షుడు - కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాల‌న్న అంశంపై నేత‌లు చ‌ర్చ‌లు జ‌రిపారు.  మొత్తానికి కాంగ్రెస్ పున‌ర్ వైభ‌వం దిశ‌గా దూసుకు వెళ్తుంద‌ని కార్య‌క‌ర్త‌లు ఆశిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News