అందుకే బాబు కుర్చీలో బాల‌య్య కూర్చున్నాడ‌ట‌!

Update: 2018-01-25 10:27 GMT
కాలానికి మించి శ‌క్తివంత‌మైన‌ది ఈ ప్ర‌పంచంలో మ‌రొక‌టి ఉండ‌దు. కాలం ఎంత ప‌వ‌ర్ ఫుల్ అంటే.. జీరోను హీరోను చేయ‌గ‌ల‌దు.. హీరోను జీరో చేయ‌గ‌ల‌దు. ఎవ‌రిదాకానో ఎందుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌ఘువీరారెడ్డి ముచ్చ‌టే చూడండి. దివంగ‌త మ‌హానేత వైఎస్ హ‌యంలో ర‌ఘువీరా వ్యాఖ్య‌లు మంట‌లు పుట్టేవి. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు చురుకు పుట్టేలా మాట్లాడ‌టంలో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా.

అలాంటి ర‌ఘువీరా మాట‌లు.. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత అంత‌గా పేల‌లేదు. అదే స‌మ‌యంలో విభ‌జ‌న త‌దిత‌ర ప‌రిణామాల‌తో ర‌ఘువీరా ఇమేజ్ పూర్తిగా మ‌స‌క‌బారిపోయింది. కాలం తెచ్చిన మార్పు ఏమో కానీ.. ఆయ‌న మాట‌ల్లో స్పార్క్ త‌గ్గిన ప‌రిస్థితి. ఏదో మాట్లాడామంటే మాట్లాడామ‌న్న‌ట్లుగా ఉండే కానీ.. గ‌తంలో మాదిరి చురుకు.. చ‌మ‌క్కు మిస్ అయిన ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఛాంబ‌ర్లో ఆయ‌న కుర్చీలో బాబు వియ్యంకుడు.. క‌మ్ ఎమ్మెల్యే బాల‌య్య కూర్చొని రివ్యూ చేసిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. భారీ చ‌ర్చ‌కు దారి తీసింది. ఈ ఉదంతంపై ఇప్ప‌టివ‌ర‌కూ బాల‌య్య రియాక్ట్ కాలేదు. ఇదిలా ఉంటే.. ర‌ఘువీరా ఈ ఉదంతంపై రియాక్ట్ అయ్యారు. త‌న తండ్రి ఎన్టీఆర్ కుర్చీని చంద్రబాబు లాక్కున్నార‌ని బాల‌కృష్ణ మ‌న‌సులో ఉండి ఉండొచ్చ‌ని.. అందుకే సీఎం రాష్ట్రంలో లేన‌ప్పుడు ఆయ‌న కుర్చీలో కూర్చున్నార‌న్నారు. ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చొని బాల‌కృష్ణ త‌న మోజు తీర్చుకున్నారంటూ చురుకుపుట్టే వ్యాఖ్య చేశారు. చాలా రోజుల త‌ర్వాత ర‌ఘువీరా నోటి నుంచి టైమ్లీగా ప‌ర్ ఫెక్ట్ పంచ్ ప‌డింద‌న్న మాట వినిపిస్తోంది.

బాబు కుర్చీలో బాల‌య్య ఎపిసోడ్‌ను ప‌క్క‌న పెడితే.. ఏపీ ముఖ్య‌మంత్రి తాజాగా చేస్తున్న దావోస్ ప‌ర్య‌ట‌న కార‌ణంగా రాష్ట్రానికి ఎన్ని కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయో స‌మాధానం చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి పెట్టుబ‌డుల మాటేమో కానీ.. దోచుకున్న‌ది దాచుకోవ‌టానికి బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల్ని పొగ‌డ‌ట‌మే ప‌నిగా ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ పెట్టుకున్నార‌ని.. ఇరు రాష్ట్రాల‌కు ప‌క్ష‌పాతం లేకుండా చూసే బాధ్య‌త గ‌వ‌ర్న‌ర్ మీద ఉంద‌న్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ రాజ్యాంగాన్ని గౌర‌వించ‌టం లేద‌ని ఫైర్ అయ్యారు.
Tags:    

Similar News