ర‌ఘువీరా.. రాజ‌కీయం మారుతుందా...?

Update: 2021-10-29 01:30 GMT
నీల‌కంఠా పురం ర‌ఘు వీరారెడ్డి. ఈ పేరు రాష్ట్ర ప్ర‌జ‌లు దాదాపు మ‌రిచిపోయే ఉంటార‌ని అంటున్నారు. గ‌తం లో మంత్రి గా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సార‌థిగా వ్య‌వ‌హ‌రించి.. ఏకంగా రెండు సార్వత్రిక ఎన్నిక‌ల్లో పార్టీ ని న‌డిపించిన నాయ‌కుడు.. ర‌ఘు వీరా. అయితే.. ఆయన గ‌త రెండున్న‌రేళ్లుగా.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఓట‌మికి బాధ్య‌త వ‌హించిన ఆయ‌న రాజీనామా స‌మ‌ర్పించారు. ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లా మ‌డ‌క‌శిర నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే.. ఆయ‌న త్వ‌ర‌లోనే మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌న్న వార్త‌ల‌తో ర‌ఘువీరా విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది.

ఇటీవ‌ల కాలం లో చంద్ర‌బాబు టీడీపీ ని బ‌లో పేతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మం లో చంద్ర‌బాబు త‌న పార్టీ తో క‌లిసి వ‌చ్చే నేత‌ల‌ కు ఫోన్లు చేస్తున్నారు. ఇలా.. ర‌ఘు వీరా రెడ్డి కి కూడా చంద్ర‌బాబు ఫోన్ చేశార‌నే వాద‌న ఒక‌టి రాజ‌కీయ వ‌ర్గా ల్లో సాగుతోంది. ర‌ఘు వీరాను చంద్ర‌బాబు ఆహ్వానించార‌ని.. అయితే.. దీని పై ఆయ‌న ఏమీ స‌మాధానం చెప్ప‌లేద‌ని అంటున్నారు. మ‌రో వైపు.. కాంగ్రెస్ నాయ‌కులు కూడా ర‌ఘు వీరాకు చేరువ అవుతున్నారు. పార్టీ కి సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వాల‌ని.. పార్టీ కి బాధ్య‌త‌లు వ‌హించాల‌ని కూడా ప‌లువురు సూచిస్తున్నారు.

అయితే.. ఇప్ప‌టి కీ.. ర‌ఘు వీరా దీని పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ర‌ఘు వీరా రాజకీయాల్లో యాక్టివ్ అవుతార‌ని.. ఖ‌చ్చితం గా.. తిరిగి పుంజుకుంటార‌ని.. ఆయ‌న‌ తో కాంగ్రెస్ కూడా పుంజుకుంటుంద‌ని.. నాయ‌కులు భ‌రోసా తో ఉన్నారు. తిరిగి ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు ఆయ‌న‌కు అప్ప‌గించాల‌ని కూడా కొంద‌రు కోరుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటి కి దేశ వ్యాప్తం గా బీజేపీ వ్య‌తిరేక ప‌వ‌నాలు పెరుగుతోన్నందున కాంగ్రెస్ పుంజుకుంటుంద‌ని.. ర‌ఘువీరా యాక్టివ్ అయితే ఏపీ లో కూడా కాంగ్రెస్ పుంజుకుంటుంద‌ని కొంద‌రు చెపుతున్నారు.

మ‌రో వైపు. టీడీపీ లోకి వ‌స్తే.. మంచి లైఫ్ ఉంటుంద‌ని.. టీడీపీ నేత‌లు హామీ ఇస్తున్న‌ట్టు ప్ర‌చారం. కానీ..ఎవరు రాజ‌కీయాల్లో కి పిలిచినా.. ర‌ఘు వీరా మాత్రం.. సైలెంట్‌ గానే ఉంటున్నారు. దీనిని బ‌ట్టి.. ఆయ‌న రాజ‌కీయం మారుతుందా?  మార‌దా? అనే చర్చ జోరుగుతోంది.
Tags:    

Similar News