రఘువీరకు తిరుగులేదు! కానీ ఉంటారా?

Update: 2019-07-01 05:20 GMT
ఏపీ పీసీసీ చీఫ్ గా వేరే వాళ్లు ఎవరూ వద్దని.. రఘువీరారెడ్డినే ఆ పదవిలో కొనసాగించాలని.. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలోని కొంతమంది నేతలు ఆ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారట. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఫలితాలను పొందిందో అందరికీ తెలిసిందే. అయినా రఘువీరారెడ్డిని  పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించవద్దని కాంగ్రెస్ నేతలు అంటున్నారట.

అయినా నిండా మునిగిన వాడికి చలేమిటి అన్నట్టుగా, ఏపీలో ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఫలితాలు ఆ పార్టీని పెద్దగా షాక్ కు గురి చేసినట్టుగా లేవు. రాష్ట్ర విభజన చేయగానే ఏపీలో కాంగ్రెస్ ఖేల్ ఖతం అయ్యింది. కాబట్టి ఇటీవలి ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ కి ప్రత్యేకంగా నష్టం కలిగించేది ఏవీ కావు. ఇలాంటి నేపథ్యంలో రఘువీరారెడ్డినే పీసీసీ చీఫ్ గా కొనసాగించిన -, కొనసాగించక మరొకరిని నియమించినా ప్రజలు కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు.

అయినా రఘువీరా రెడ్డే ఆ పదవిలో కొనసాగాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసేస్తూ ఉన్నారు. అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుంది రఘువీరకు. అయినా ఆయన కాంగ్రెస్ లో ఉంటారా? అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఆయన బీజేపీలోకి చేరవచ్చనే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి రఘువీరకు చాలా డిమాండే వచ్చినట్టుంది!
Tags:    

Similar News