బాబు వ‌ల్ల బీజేపీ ఎలా బ‌లైందో చెప్తున్న నేత‌

Update: 2018-05-03 16:41 GMT
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఒక‌నాటి ఆప్తుల జాబితాలో ఒక‌రైన ప్ర‌స్తుత కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సి.రామ‌చంద్ర‌య్య టీడీపీ ర‌థ‌సార‌థి గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు పంచుకుంటున్నారు. ఆయ‌న‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్తున్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంత‌ప‌రంగా శ‌త్రువు అయిన బీజేపీని హెచ్చ‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం. కాంగ్రెస్‌పై చంద్ర‌బాబు చేస్తున్న విమ‌ర్శల‌కు కౌంట‌ర్ ఇచ్చిన రామచంద్ర‌య్య ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకొని పోటీ చేయడం నారా చంద్రబాబు నాయుడుకు అలవాటు అని ఎద్దేవా చేశారు. విజ‌యాలు త‌న‌ఖాతాలోకి, అప‌జ‌యాలు ఎదుటివారి ఖాతాలో వేయ‌డం ఆయ‌న‌కు అల‌వాట‌ని వ్యాఖ్యానించారు.

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు తీరు చిత్రంగా ఉంటుంద‌ని సి.రామ‌చంద్ర‌య్య అన్నారు. చంద్రబాబు లీకులు మాత్రమే ఇస్తారని, ఏ విషయాన్ని సూటిగా చెప్పరన్నారు. ఆ లీకుల‌ను ప‌ట్టుకొని బ్ర‌హ్మండం బ‌ద్ద‌లైన‌ట్లు పార్టీ నేత‌లు చెప్తార‌ని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత వైఫల్యాలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సి.రామచంద్రయ్య అన్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో మొద‌టి నుంచి వివిధ పార్టీలు ఆందోళ‌న చేస్తుంటే...వాటిని అణిచివేసి ఇప్పుడు హోదా కోసం గ‌ళం విప్ప‌డం చంద్ర‌బాబుకే చెల్లింద‌ని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ముతో చంద్రబాబు దీక్షలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీక్షల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదిలాఉండ‌గా...కర్నాటక ఎన్నిక‌ల ప్ర‌చారం ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి బిజీబిజీగా ప్రచారం చేస్తున్నారు. ఏపీ ప్రత్యేక హోదా సెగలు కర్నాకట ఎన్నికల్లో కూడా ప్రభావం చూపిస్తాయంటూ రఘువీరారెడ్డి తెలిపారు. కర్నాటకలో ఉన్న తెలుగు వారు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. కర్నాటకలో ఉన్న సెటిలర్స్‌ అందరూ కాంగ్రెస్‌కే ఓటు వేస్తారని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కనీసం 130 సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Tags:    

Similar News