చిరంజీవి కాంగ్రెస్సే..రఘువీర కామెడీ..
చిరంజీవి ఇప్పుడు ఏ పార్టీ.. కాంగ్రెస్ లో అసలు ఆయన ఉన్నారా.? మెగా ఫ్యామిలీ మొత్తం జనసేనకు సపోర్టు చేస్తున్నవేళ మెగాస్టార్ కూడా తమ్ముడికి అనుకూలంగా వ్యవహరిస్తున్న వేళ.. ఇంకా చిరును కాంగ్రెస్ వాదిగానే చూడాలా.? అందరూ ఏమనుకున్నా పర్లేదు.. నాకు మాత్రం చిరంజీవి కాంగ్రెస్ నాయకుడే అంటున్నారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి..
రాంచరణ్ - బన్నీ - వరుణ్ తేజ్ - సాయిధరమ్ ఇలా అందరూ మెగా హీరోలు జనసేనాని పవన్ కు పూర్తి మద్దతు ప్రకటించేశారు. చిరంజీవి తల్లి కూడా చిన్న కొడుకు పవన్ పార్టీకి రూ.4 లక్షల డొనేషన్ ఇచ్చి ఫుల్ సపోర్ట్ చేసింది. పవన్ కూడా తన అన్నయ్య ఆశీర్వాదం తనకుందని చెప్పుకొచ్చాడు. ఇలాంటి నేపథ్యంలో రఘువీరా రెడ్డి మాత్రం చిరంజీవిని ఇంకా కాంగ్రెస్ వాదిగానే చూడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
చిరంజీవి రాజకీయాల కాడి వదిలేసినట్టు కనిపిస్తున్నాడు. తన మానాన తను మళ్లీ సినిమాలు చేసుకుంటూ రాజకీయాలకు దూరంగా జరిగారు. స్వయంగా మొన్నీ మధ్య రాహుల్ వచ్చినా కనిపించలేదు.. కలువలేదు. ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. కానీ రఘువీరా మాత్రం చిరంజీవి ఎన్నికల ముందు మళ్లీ కాంగ్రెస్ లో యాక్టివ్ అవుతాడని.. ఎన్నికలకు రెండు మూడు నెలల ముందుకు పార్టీలోకి వచ్చి ప్రచారం చేస్తాడని చెప్పుకుంటుండడం విశేషం..