సీఎం జగన్ కు రఘురామ మరో లేఖ

Update: 2021-06-18 09:30 GMT
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ మరో లేఖ రాశారు. ఇప్పటికే వరుసగా లేఖలు రాస్తూనే ఉన్నారు. వివిధ అంశాలపై ఏపీ సీఎంకు ఈ లేఖలు సంధిస్తున్నారు. 8వ రోజు కూడా సంపూర్ణ మద్య నిషేధంపై జగన్ కు లేఖ రాశాడు.

తన 9వ లేఖలో రఘురామకృష్ణంరాజు ఏపీలో జగన్ ఇచ్చిన హామీపై లేఖ రాశాడు. ఆంధ్రప్రదేశ్ లో గెలిస్తే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చారని.. అయితే ఆ నిషేధం అమలు కావడం లేదని రఘురామ పేర్కొన్నాడు. నియంత్రణ కంటే మద్యపాన ప్రోత్సాహమే ఏపీలో ఎక్కువ జరుగుతోందని రఘురామ లేఖలో అభిప్రాయపడ్డాడు.  ఏపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం హామీకి కట్టుబడి ఉండాలని తన లేఖలో రఘురామ విన్నవించారు.

ఇక అమ్మఒడికి లింకు పెట్టి  ఎంపీ రఘురామ మద్యపాన నిషేధంపై కీలక సెటైర్లు వేశాడు. మద్యంపైన రాబడిని అమ్మఒడి పథకానికి ఇస్తామని చెప్పారని రఘురామ గుర్తు చేశారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఏపీలో మద్యం అమ్మకాలు 16శాతం పెరిగాయని తెలిపారు. పేద, మద్యతరగతి ప్రజలకు భరించలేని విధంగా పన్నులు పెంచారని తన లేఖలో రఘురామ విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి పెట్టిన అమ్మ ఒడి పథకం నాన్న బుడ్డిగా మారిందన్నారు. అమ్మఒడి డబ్బులు మద్యం ప్రియులకు మద్యపానం కోసం ఖర్చు చేస్తున్నట్లుగా రఘురామ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీకి కట్టుబడి పనిచేయాలని సూచించారు.

ఇప్పటికే ప్రధానికి, కేంద్రమంత్రులకు, గవర్నర్లకు లేఖలు రాస్తూ వస్తున్న ఎంపీ రఘురామ ఇప్పుడు ఏకంగా సీఎం జగన్ కే వరుసగా ఆయన హామీల అమలుపై లేఖలు రాస్తూ ఠారెత్తిస్తున్నారు.
Tags:    

Similar News