స్పీక‌ర్‌కు టెస్టు పెడుతున్న జంపింగ్ ఎమ్మెల్యేలు!

బీఆర్ ఎస్ పార్టీ టికెట్ల‌పై 2023 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న ప‌ది మంది ఎమ్మెల్యేలు త‌ర్వాత‌.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయిన విష‌యం తెలిసిందే.;

Update: 2026-01-31 09:30 GMT

బీఆర్ ఎస్ పార్టీ టికెట్ల‌పై 2023 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న ప‌ది మంది ఎమ్మెల్యేలు త‌ర్వాత‌.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జంపింగుల‌పై అన‌ర్హ‌త వేటు వేయించాల‌ని బీఆర్ ఎస్ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిపై సుదీర్ఘ న్యాయ పోరాటం కూడా సాగింది. చివ‌ర‌కు.. స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు విచార‌ణ వ‌ర‌కు వ‌చ్చింది. ఆయ‌న 8 మంది ఎమ్మెల్యేల‌కు క్లీన్ చిట్ ఇచ్చారు.

వారెవ‌రూ పార్టీ మార‌లేదని.. బీఆర్ ఎస్‌లోనే ఉన్నార‌ని.. నాలుగు రోజుల కిందట కూడా ప్ర‌క‌టించారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విష‌యాన్ని చెప్పుకొచ్చారు. మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు.. దానం నాగేంద‌ర్‌, కడియం శ్రీహ‌రిల వ్య‌వ‌హారం పెండింగులో ఉంది. అయితే.. బీఆర్ ఎస్ పార్టీ మాత్రం.. జంపింగులు.. పార్టీ మారార ని.. వారిని అధికార పార్టీ కాపాడుతోంద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై మ‌రోసారి న్యాయ పోరాటానికి కూడా రెడీ అవుతున్నారు.

ప‌రిణామాలు ఇంత తీవ్రంగా ఉన్న స‌మ‌యంలో జంపింగ్ ఎమ్మెల్యేలు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, దీనికి భిన్నంగా ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు.. వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో మ‌రోసారి స్పీక‌ర్ ప్ర‌సాద‌రా వు.. ఇరుకున ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇటీవ‌ల స్పీక‌ర్ క్లీన్ ఇచ్చిన గ‌ద్వాల్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కృష్ణ‌మోహ న్ రెడ్డి.. బ‌హిరంగంగా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. ఆయ‌న వ్య‌వ‌హార శైలి కూడా.. వివాదా నికి దారి తీసింది.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స్థానిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఆయ‌న బ‌హిరంగ ప్ర‌చారం చేస్తున్నారు. అంతేకాదు.. పెద్ద ఎత్తున ప్ర‌సంగాలు కూడా దంచికొట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. బీఆర్ ఎస్‌పై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ ప‌ని అయిపోయింద‌ని.. ఇక‌, రేవంత్ రెడ్డి సార‌థ్యంలోనే రాష్ట్రం డెవ‌ల‌ప్ అవుతుంద‌ని చెప్పుకొచ్చారు. దీంతో బీఆర్ ఎస్ నాయ‌కులు ఈ రికార్డుల ఆధారంగా మ‌రోసారి స్పీక‌ర్ పేషీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

కానీ.. కృష్ణ‌మోహ‌న్ రెడ్డి గ‌త నెల‌లో స్పీక‌ర్ పేషీకి వ‌చ్చి వివ‌ర‌ణ ఇచ్చిన‌ప్పుడు తాను బీఆర్ ఎస్‌లోనే ఉన్నాన‌ని.. త‌న‌కు కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పుకొచ్చారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ప‌రిణామాలు.. వ్య‌క్తిగ‌తంగా వారికి, స్పీక‌ర్‌కు కూడా ఇబ్బందిగా మారుతున్నాయి.

Tags:    

Similar News