వీళ్లు బంధువులు కాదు.. రాబంధులు.. అంత్యక్రియలకు రాలేదు.. దశదినకర్మకు క్యూ కట్టారు..!
కరోనా వేళ మానవ సంబంధాలు ఎలా మట్టిలో కలిసిపోతున్నాయో? చూస్తూనే ఉన్నాము. కరోనాతో ఎవరైనా చనిపోతే కనీసం వాళ్ల చుట్టాలు కూడా రావడం లేదు. కొన్ని చోట్ల అయితే బంధువులు.. తోడబుట్టిన వాళ్లు కూడా రావడం లేదు. కరోనాతో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు 25 మందికి మించి హాజరు కావొద్దని ప్రభుత్వం చెబుతున్నది. కరోనా మృతదేహాలతో కరోనా వ్యాపించదని.. భౌతిక దూరం పాటించి ఈ తంతు నిర్వహించుకోవచ్చని వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కానీ కరోనా మృతదేహాలకు మాత్రం సరిగ్గా అంత్యక్రియలు జరగడం లేదు. గంగా నదిలో వందల కొద్దీ కరోనా మృతదేహాలు పడేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
బీహార్ కు చెందిన ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు. నాలుగు రోజుల అనంతరం అతడి భార్య కూడా చనిపోయింది. దీంతో వాళ్ల ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. అయితే ఈ పరిస్థితుల్లో వాళ్ల అంత్యక్రియలకు గ్రామస్థులు ఎవరూ సహకరించలేదు. ఆ ముగ్గురు పిల్లలు ఎలాగోలా అంత్యక్రియలు చేశారు. అయితే ఆ పిల్లలు ఇటీవల తల్లిదండ్రులకు దశదిన కర్మ చేస్తే.. భోజనాలకు మాత్రం 150 మంది గ్రామస్థులు వచ్చారు. పైగా మీ తల్లి దండ్రులు కరోనాతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు సాయం చేశామంటూ ఆ పిల్లల దగ్గర ఉన్న కొద్ది పాటి డబ్బులు కూడా తీసుకొని వెళ్లిపోయారు.
కనీసం మానవత్వం మరిచి వాళ్లు ప్రవర్తించిన తీరుపై అంతా తిట్టిపోస్తున్నారు. అయితే బీహార్లో జరిగిన ఆ ఘటన వెలుగులోకి వచ్చిందేమో కానీ.. మన చుట్టూ కూడా ఇటువంటి ఘటనలు ఎన్నో జరిగాయి. కరోనా వేళ కొంతమంది మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.
బీహార్ అరియా జిల్లాలో బిష్ణుపుర గ్రామపంచాయతీకి చెందిన సోని(18) నితీష్ (14 ), చాందిని (12). వీళ్ల తల్లిదండ్రులు ఇటీవలే కరోనాతో చనిపోయారు.
వీళ్ల తండ్రి బిరేంద్ర సింగ్ అనారోగ్యంతో చనిపోయారు. తల్లి ప్రియాంక దేవి కరోనాతో చనిపోయింది.
గ్రామస్థులు ఒక్కరూ కూడా సాయం చేయలేదు. దీంతో సోని.. ఎలాగోలా కష్టపడి అంత్యక్రియలు జరిపింది. అయితే ఇటీవల తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం నిర్వహించిన దశదిన కర్మకు భోజనం చేసేందుకు 150 మంది గ్రామస్తులు వచ్చారు. దీంతో ఆ పిల్లలు ఆశ్చర్యపోయారు. పైగా తల్లిదండ్రులు తమ దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వాలంటూ గ్రామస్థులు ఒత్తిడి చేశారని పిల్లలు వాపోతున్నారు.