మరో ఘనత సాధించిన పీవీ సింధు..

Update: 2022-07-17 08:30 GMT
తెలుగుతేజం పీవీ సింధు గత కొన్నిరోజులుగా సరిగ్గా రాణించడం లేదు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యపతకం నెగ్గిన తర్వాత పెద్ద టోర్నీలో తెలుగుతేజం పీవీ సింధు ఆశించినస్థాయిలో ఆడలేకపోతోంది. ఇక ఈ ఏడాది జరిగిన సూపర్ 300 కేటగిరి టోర్నీలు అయిన స్విస్ ఓపెన్, సయ్యద్ మోడీ లు మాత్రమే గెలిచింది. తొలిసారి సూపర్ 500 టైటిల్ గెలిచింది.

ఆదివారం సింగపూర్ ఓపెన్ లో చాంపియన్ గా అవతరించింది. మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన ఫైనల్లో సింధు 21-9,11-21,21-15తో చైనాకు చెందిన షట్లర్, ప్రపంచ నంబర్ 11 ర్యాంకర్ వాంగ్ జి యుపై అద్భుత విజయాన్ని సాధించింది. 58 నిమిషాల పాటు సాగినఈ తుది పోరులో ప్రత్యర్థిని ఓడించిన సింధు ఛాంపియన్ గా నిలిచింది.

ఆట ఆరంభం నుంచే పీవీ సింధు తన ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిపత్యం చెలాయించింది. తొలి గేమ్ లో ప్రత్యర్థికి కేవలం 9 పాయింట్లనే కోల్పోయిన ఆమె ఫైనల్ పోరును అద్భుతంగా ఆరంభించింది. అయితే రెండో గేమ్ లో వాంగ్ జి యి పుంజుకొని సింధుపై ఎదురుదాడికి దిగింది. ఈ  క్రమంలోనే రెండో గేమ్ ను వాంగ్ జి 21-11తో సొంతం చేసుకుంది. దీంతో గేమ్ మూడో రౌండ్ కు వెళ్లింది.

అయితే మూడో గేమ్ లో సింధు తన గేర్ ఛేంజ్ చేసింది. ఇక్కడ అద్భుత ఆటతీరును కనబరిచిన సింధు ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రత్యర్థిపై పైచేయి సాధించి ఈ ఏడాది తొలి సూపర్ 500 టైటిల్ ను అందుకుంది.

గతంలోనూ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ లో కూడా వాంగ్ జి యిపై సింధు వరుస గేముల్లో నెగ్గడం విశేషం. సింధు సెమీఫైనల్ లో 21-15,21-7 తో సయిన కవాకమి(జపాన్)పై నెగ్గింది. మరో సెమీఫైనల్ పోరులో వాంగ్ 21-14,21-,14తో ఒహోరిపై అద్భుత విజయాన్ని సాధించింది.
Tags:    

Similar News