బాబుకు - నీకు తేడా ఏంటో చెప్పమ్మా పురంధేశ్వరీ!
నీతుల చెప్పటానికేనా....పాటించడానికి పనికిరావా.....విలువలు ఎదుటివారు పాటించాలా...మరి మనము పాటించక్కర్లేదా...మాట మీద ఇతరులే నిలబడాలా...మనం నిలబడకపోయినా ఫర్వలేదా..... ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా...ఇంకెవరండీ బాబూ దివంగత మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయ పురంధరేశ్వరి. రాజకీయాలలో శాశ్వత శత్రువులు - శాశ్వత మిత్రులు ఉండరని అందరికీ తెలిసిన విషయమే. కాని మంత్రులుగాను, ప్రజాప్రతినిధులుగాను పదవులు వెలగబెట్టిన రాజకీయ నాయకులు కనీస విలువలు పాటించక్కర్లేదా.... పురంధరేశ్వరి మాటలు వింటుంటే అక్కర్లేదేమో అనిపిస్తోంది. నిన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు అనుభవించి 2014 లో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత వెంటనే కేవలం పదవుల కోసం భారతీయ జనతా పార్టీ పంచన చేరిన పురంధరేశ్వరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తున్నారు.
తెలుగుదేశం అవిర్భావమే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జరిగిందని... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో చేరి దిగజారుడు రాజకీయాలకు తెర తీశారని పురంధరేశ్వరి అన్నారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు పొత్తుపై ఆవిడ విరుచుకుపడ్డారు. అయితే చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత ఏపీలో తెలంగాణలో ఎవరికైనా ఉందేమో గానీ పురంధరేశ్విరికి ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా పురంధరేశ్వరి ఆడిన డ్రామాలు అన్నీ ఇన్నీ కావు.... వాటిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు కూడా...కనీసం ప్రజాప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు కూడా ఆవిడ లెక్క చేయలేదు. అంతే కాదు కనీసం ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా లెక్కచేయలేదు. అలాంటి పురందరేశ్వరి ఈ రోజు చంద్రబాబు నాయడు తెలంగాణ ముందస్తు ఎన్నికల కోెసం కాంగ్రెస్ పార్టీతో జత కట్టడాన్ని విమర్శించడం హాస్యాస్పందంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పురంధేశ్వరి అన్న ప్రతిమాటకు చంద్రబాబు అర్హుడేమో గానీ... ఆ విమర్శలు చేయడానికి మాత్రం పురంధరేశ్వరి అర్హురాలు కాదన్నది సో్షల్ మీడియా అభిప్రాయం. చంద్రబాబు తిట్టినందుకు కాదు ఆమె మీద ఆగ్రహం... కాంగ్రెస్ బతుకు బతికి... ఎన్టీఆర్‌కు ద్రోహం చేస్తావా అని తిట్టడం పైనే జనం అభ్యంతరం. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరి కేవలం పదవుల కోసం పాకులాడే పురందరేశ్వరికి ఉన్న నీతి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. నిజమేకదా....ఎదుటి వారికి నీతులు చెప్పే అర్హత పురందరేశ్వరికి ఎక్కుడుందీ అని రాజకీయ విశ్లేషకులు కూడా వంత పాడుతున్నారు. చంద్రబాబు ఇపుడు చేస్తున్న తప్పును పురంధేశ్వరి దశాబ్దం క్రితమే చేసేశారు. కాదంటారా? చెప్పండి.