ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం .. 50 వేల మంది విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు !

Update: 2020-07-29 04:15 GMT
కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చి మళ్లీ కొంచెం కొంచెం గా అన్ని రంగాలు పనులని ప్రారంభించాయి. కానీ , విద్యారంగం పై కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కరోనా నేపథ్యంలో స్కూల్స్ , కాలేజీలకు సెలవులు ఇచ్చారు. కరోనా అయితే ఇప్పట్లో తగ్గేలా లేదు. ఈ సమయంలో కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ విద్య వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే దేశంలోని కొన్ని విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులని కూడా ప్రారంభించారు. అయితే , ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ క్లాసులకి హాజరు అవ్వాలంటే కంప్యూటర్ కానీ , స్మార్ట్ ఫోన్ కానీ ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర అవి అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో చాలామంది స్మార్ట్ ఫోన్స్ కొనడానికి  కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లు లేక పేద విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేక పోతున్నారు.  ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసుల నిర్వహణ కోసం పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 11 ,12  తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్స్ పంపిణీ చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 50 వేల మంది బాలికలకు పంపిణీ చేసేందుకు ఫోన్ లను సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని పంజాబ్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో  మొత్తం 50 వేల మంది బాలికలకు పంపిణీ చేసేందుకు ఫోన్ లను సిద్ధం చేసింది. చైనా కు సంబంధం లేకుండా పూర్తిగా ఇండియాలోనే తయారైన లావా ఫోన్ లోను వీరికి ఇవ్వబోతున్నారు.
Tags:    

Similar News