• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమెరికా నిరసనల సెగ భారతీయ...

అమెరికా నిరసనల సెగ భారతీయ దుకాణాలకు తగిలింది

By - Tupaki Desk
Update: 2020-06-03 10:50 GMT
ఒక పోలీసు అధికారి ఆరాచకం కారణంగా యావత్ అమెరికా రగిలిపోయేలా చేయటమే కాదు.. అన్ని రాష్ట్రాల్లోనూ నిరసనలు.. ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ పట్ల క్రూరంగా వ్యవహరించి.. అతడి మరణానికి కారణమైన పోలీసు అధికారిపై కోపం.. అమెరికాలో పెను విధ్వంసానికి కారణంగా మారింది. నిరసనల్లో భాగంగా పలు షాపుల్ని లూటీ చేయటమే కాదు.. చాలా దుకాణాల్ని దోచేశారు. తమ ఆగ్రహాన్ని ప్రదర్శించుకునేందుకు ఎవరికి తోచిన విధ్వంసానికి వారు పాల్పడినట్లుగా చెబుతున్నారు.

ఇలాంటివేళ.. అమెరికాలోని భారతీయ దుకాణాల సంగతేమిటి? అన్నది చూస్తే.. ఈ విద్వంసంలోచాలానే షాపులు అగ్నికి ఆహుతి అయిపోయినట్లు తెలుస్తోంది. మాయదారి రోగం కారణంగా గడిచిన కొద్దినెలలుగా వ్యాపారాలు దారుణంగా దెబ్బ తింటే.. తాజాగా నెలకొన్న ఆందోళనల కారణంగా దివాళా తీసే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.

మినియాపోలిస్ లో భారతీయులకు చెందిన పలు దుకాణాలు ఉన్నాయి.  ఇప్పటివరకూ ఇక్కడి భారతీయుల దుకాణాల్నివందల సంఖ్యలో నష్టపోయినట్లు తెలుస్తోంది. ఒక అంచనా ప్రకారం 308 దుకాణాలు.. రెస్టారెంట్లు విధ్వంసానికి గురైనట్లు స్థానిక మీడియా చెబుతోంది. గాంధీ మహల్ రెస్టారెంట్.. హండీ రెస్టారెంట్.. ఇంటర్నేషనల్ బజార్.. అనన్య డ్యాన్స్ థియేటర్ లాంటి ఎన్నో ప్రవాసీయుల దుకాణాలు.. వాణిజ్య సంస్థలపై దాడి జరిగినట్లుగా చెబుతున్నారు. ఒక భారతీయ కుటుంబానికి చెందిన కార్ల షోరూం కూడా నిరసనల్లో పూర్తిగా కాలిపోయింది. అమెరికా వ్యాప్తంగా నిరసనలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్న ప్రతి చోట భారతీయులకు చెందిన వాణిజ్య సంస్థలకు అంతో ఇంతో నష్టం జరుగుతుందని చెబుతున్నారు.  
Tags:    
  • George Floyd Postmortem Report 
  • America 
  • Donald Trump 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS