కాంగ్రెస్ నేత.. విడుదల కావాలి - బీజేపీ నేతల కోరిక!

Update: 2019-09-07 01:30 GMT
'డీకే శివకుమార అరెస్టు అయినందుకు మేమేం ఆనందంగా లేము..ఆయన విముక్తులు కావాలని - బయటకు రావాలనే మేం ఆకాంక్షిస్తున్నాం..' అంటూ ప్రకటన చేశారు  కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప. కేవలం ఆయన మాత్రమే  కాదు..బీజేపీ కర్ణాటక సీనియర్ నేతలంతా ఈ తరహా ప్రకటనలే చేస్తూ ఉన్నారు. డీకే శివకుమార విడుదల కావాలని, ఆయన నిర్దోషిగా తేలాలని తాము ప్రార్థిస్తున్నట్టుగా వాళ్లు ప్రకటించుకుంటున్నారు.

ఇలా అరెస్టు అయిన కాంగ్రెస్ నేతల కోసం తాము ప్రార్థనలు చేస్తున్నట్టుగా బీజేపీ నేతలు బాహటంగానే ప్రకటనల చేస్తున్నారు. ఈ ప్రకటనల్లోనే ఉంది అసలైన రాజకీయం. ఒకవైపు డీకే శివకుమార అరెస్టుపై రామనగర్ ఏరియా భగ్గుమంది. ఆయన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు కర్ణాటక వ్యాప్తంగా నిరసనలకు దిగారు. బస్సులను కూడా తగలబెట్టారు. ఇలా డీకే అరెస్టు నిప్పు రాజేసింది. ఆయన అరెస్టుపై అసహనంతో ఉన్నది కేవలం కాంగ్రెస్ కార్యకర్తలే కాదట..డీకే శివకుమార సొంత సామాజికవవర్గం వారు కూడా ఇప్పుడు బీజేపీ మీద గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.

డీకే శివకుమార గౌడ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఆ సామాజికవర్గంపై కొన్నేళ్లలో మంచి పట్టు సాధించారు. ఇలాంటి నేపథ్యంలో తమ వర్గానికి చెందిన ప్రముఖుడిని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా బీజేపీ అరెస్టు చేయించిందని వారు అనుకుంటున్నారట. దీంతో వారు బీజేపీకి పూర్తిగా దూరం అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో గౌడలు కూడా పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు పలికారు. ఇప్పుడు డీకే అరెస్టుతో అలాంటి ఓటు బ్యాంకు దూరం అవుతుందని..బీజేపీ నేతలకు భయం పట్టుకుంది. అందుకే వాళ్లు డీకే శివకుమార విడుదల కావాలని బాహటంగా ప్రకటనలు చేస్తూ ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు.


Tags:    

Similar News