జగన్ పై గురి.. పావుగా స్వరూపానంద

Update: 2019-07-03 07:38 GMT
టీడీపీ హయాంలో భ్రష్టుపట్టిన రేషన్ వ్యవస్థను జగన్ రాగానే ప్రక్షాళన చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో డీలర్లు కోట్లకు కోట్లు కుమ్మేస్తూ ప్రజలకు సరుకులు అందకుండా చేస్తున్న ఆరోపణలకు పరిష్కారంగా ప్యాకెట్ల రూపంలో సరుకులు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అంతేకాదు.. గ్రామ వలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటికే పంపేలా జగన్ చర్యలు చేపట్టారు. దీంతో తమ అవినీతి నడువదని భావించిన రేషన్ డీలర్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు.

అయితే ఈ విషయంలో రేషన్ డీలర్లు అభ్యంతరం తెలుపుతున్నారు.  తమకు కొరకరాని కొయ్యగా మారిన జగన్ ప్రభుత్వానికి ఎన్ని వినతలు ఇచ్చినా మారకపోయేసరికి ఇప్పుడు అటు నుంచి నరుక్కురావడానికి.. అభాసుపాలు చేయడానికి రెడీ అయ్యారట..

తాజాగా రేషన్ డీలర్ల సంఘంలోని టీడీపీ ప్రేరిపిత డీలర్లు జగన్ కు బాగా సన్నిహితులైన శారదాపీఠాధిపతి స్వరూపానందను కలిసి తమ సమస్యలను జగన్ తీర్చేలా ఒప్పించాలని ప్రయత్నించారట.. కానీ ఆయన ఇలాంటి వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ వారిని ఆశ్రమానికే రానీయ్యలేదని తెలిసింది.

దీంతో తాజాగా కొందరు రేషన్ డీలర్లు భక్తుల ముసుగులో ఆయనను దర్శించుకొని ఫొటోలను లీక్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటోలను పట్టుకొని టీడీపీ నేతలు, సోషల్ మీడియా విభాగం ఏపీలో స్వరూపానంద కేంద్రంగా పాలన సాగుతోందని దుమ్మెత్తిపోసే ప్రక్రియకు తెరతీశారట.. రేషన్ డీలర్ల సంఘం దీన్ని ఖండించి ఆ కలిసిన నేతలు రాజకీయ ప్రేరేపితులు అని చెప్పినా ఆ వివాదం చల్లారడం లేదు. ఇలా టీడీపీ అధికార వైసీపీని స్వరూపానందాను బేస్ చేసుకొని దెబ్బతీయడానికి స్కెచ్ గీయడం తాజాగా సంచలనంగా మారింది.

తెలంగాణలోనూ చిన్నజీయర్ స్వామిని కలిసి రెవెన్యూ ఉద్యోగులు ఆ శాఖను ప్రక్షాళన చేయకుండా కేసీఆర్ కు చెప్పాలని వినతిపత్రం ఇవ్వడం సంచలనంగా మారింది. ఇలా కేసీఆర్,జగన్ ల ఆధ్యాత్మిక ముసుగును బేస్ చేసుకొని ప్రత్యర్థులు స్వామీజీలను పావుగా వాడడం తాజా రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

    
    
    

Tags:    

Similar News