సొంతోళ్లు ‘తలైవా’ను తిట్టిపోస్తున్నారే

Update: 2016-07-25 07:30 GMT
ఇంట గెలిచి రచ్చ గెలవమని చెబుతుంటారు. ఇప్పటివరకూ ఇంటా బయటా అన్న తేడా లేకుండా అందరి అభిమానం పొందిన సూపర్ స్టార్ రజనీకాంత్ తీరుపై తాజాగా ఆయన సొంతరాష్ట్రమైన కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్వతహాగా కన్నడిగైన రజనీ తమిళులు తమ ఆరాధ్య దైవంగా కొలిచే సంగతి తెలిసిందే. ఆయన నటించిన తాజా చిత్రం కబాలి ప్రపంచ వ్యాప్తంగా ఊపేస్తుంటే.. రజనీ సొంత రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకంది.

కబాలి చిత్రానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించటం.. పోస్టర్లను చించివేసి.. కాల్చస్తూ తలైవా మీద తమకున్న కోపాన్ని ప్రదర్శిస్తున్నారు కన్నడిగులు. రజనీ మీద కన్నడవాసులకు అంత కోపం ఎందుకంటే.. ఆయన కర్ణాటకకు చెందిన వ్యక్తే అయినప్పటికీ తమిళ పక్షపాతిగా వారు అభివర్ణిస్తున్నారు. కావేరీ జల వివాదంలో రజనీకాంత్ తమిళనాడుకు మద్దతు ఇచ్చారని.. అందుకే ఇంత ఆగ్రహమని చెబుతున్నారు. సొంతప్రాంత ప్రజలకు కష్టం కలిగించే రజనీ సినిమాను 300 థియేటర్లలో ఎలా విడుదల చేస్తారని పలువురు ప్రశ్నించటం గమనార్హం.
Tags:    

Similar News