ఇదీ మీ ప్రభుత్వ పనితీరు - యోగి రాజీనామా చేయాలి..ప్రియాంక డిమాండ్!
హత్రాస్ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో మృతి చెందిన బాధితురాలి అంత్యక్రియలను నిన్న అర్ధరాత్రి 2:30 గంటలకు హడావిడిగా పోలీసులు నిర్వహించారు. ఆమె అంత్యక్రియలకు కుటుంబ సభ్యులను సైతం పోలీసులు అనుమతించలేదు. పోలీసుల వాహనానికి, అంబులెన్స్ కు బాధితురాలి కుటుంబ సభ్యులు అడ్డు పడ్డారు. నిందితులు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కానీ పోలీసులు మాత్రం టుంబ సభ్యుల మాట వినకుండా రాత్రికి రాత్రే బాధితురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసుల తీరుపై స్థానికులు , విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ లైంగికదాడి ఘటనపై యూపీ కాంగ్రెస్ ఇంచార్జీ ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీరు పై విరుచుకుపడ్డారు. అర్ధరాత్రి అంత్యక్రియలు చేశారని .. ఇదీ మీ ప్రభుత్వ పనితీరు అని ధ్వజమెత్తారు. జరిగిన ఘటనకు సీఎం ఆదిత్యనాథ్ నైతిక బాధ్యత వహించి , సీఎం యోగి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏమో కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతుంది. కానీ, కేవలం అవి మాటలకి మాత్రమే పరిమితం అవుతున్నాయని, దానికి తగ్గ చర్యలు మాత్రం అలా ఉండటం లేదని, ఇదే అదునుగా భావించి నేరగాళ్లు రెచ్చిపోతున్నారు అని ధ్వజమెత్తారు.
హత్రాస్ ఘటనపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో యోగి సర్కార్ స్పందించింది. యువతిపై లైంగికదాడి ఘటనపై ముగ్గురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. అలాగే, వారంలో నివేదిక సమర్పించాలని గడువు విధించింది. ఆ తర్వాత విచారణ కోసం ఫాస్ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసింది. దీంతో వేగంగా విచారణ జరిగి, నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంది.