విద్యార్థినులని లోదుస్తులు విప్పి ఆ పరీక్ష ... ప్రిన్సిపాల్, వార్డెన్ పై కేసు నమోదు
సభ్యసమాజం తలదించుకునే ఘటన మరొకటి జరిగింది. అది కూడా విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాలలు , కాలేజీలలో ఇలాంటి ఓ ఘటన జరగడం చాలా విచారకరం. ఇంతకీ అక్కడ ఏమి జరిగింది అంటే ..గుజరాత్ లోని బుజ్ జిల్లాలో శ్రీ సహజానంద గర్ల్స్ ఇనిస్టిట్యూట్ ఉంది. స్వామి నారాయణన్ మందిర్ భక్తులు ఈ ఇనిస్టిట్యూట్ భాద్యతలు చూసుకుంటున్నారు. దీనితో అక్కడ కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి అని రూల్ పెట్టారు. ఇదే కాలేజీ ప్రాంగణంలో ఒక ఆలయం ఉంది. రుతుక్రమంలో ఉన్న సమయంలో విద్యార్థినిలు ఆ ఆలయంలోకి వెళ్లడం కానీ , కిచెన్ లోకి వెళ్లడం కానీ , తమ తోటి విద్యార్థులని తాకడం కానీ చేయకూడదు అని రూల్ ఉంది. ప్రస్తుతం ఆ కాలేజ్ లో మారుమూల ప్రాంతాలకు చెందిన 1500 మంది విద్యార్థినిలు ఇక్కడ చదువుకొంటున్నారు. అయితే కాలేజీ ప్రాంగణంలో ఉన్న ఆలయంలోకి విద్యార్థినిలు రుతుక్రమం లో ఉన్న సమయంలో కూడా ఆలయానికి వెళ్తున్నారని వార్డెన్ గుర్తించి.. ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో , ఆలా కాలేజ్ నియమాన్ని పాటించని విద్యార్థులని కని పెట్టడానికి , ప్రిన్సిపాల్ 64 మంది విద్యార్థినీలకు వరసక్రమంలో నిలబెట్టారు. రుతుక్రమం గురించి అడగగా.. లేదని చెప్పడంతో ఒక్కొక్కరిని అండర్ వేర్ విప్పమని కోరారు. కాలేజ్ నియమాలని కొందరు నిబంధనలు ఉల్లంఘించడంతో బాలికలను అండర్ వేర్ విప్పాలని కోరడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. విశ్రాంతి గదిలోకి తీసుకెళ్లి మరీ చూశారని, ఇప్పుడే కాదు ఇదివరకు కూడా ఇలా చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
అయితే , ఈ ఘటన పై కాలేజీ ట్రస్టీ లోని సభ్యుడు స్పందిస్తూ .. దీనిపై కోర్టుకు వెళ్లాలనుకుంటే వెళ్లాలని.. కానీ కాలేజీ హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని తెలిపారు. భారతీయ విలువలు, సాంప్రదాయాలు అనే పునాదులపై శ్రీ సహజనంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్ ని ఏర్పాటు చేసారని , ఇక్కడి నియమాలని అందరూ పాటించాల్సిందే అని తెలిపారు. ఘటనపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. ఘటనపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నది. విద్యార్థులతో సమావేశమై ఏం జరిగిందో తెలుసుకుంటామని తెలిపారు. ఘటన పై కాలేజీ ట్రస్టీ, ప్రిన్సిపాల్ నుంచి వివరణ తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ ఘటన పై పోలీసులు కూడా సీరియస్ గా స్పందించారు. ప్రిన్సిపాల్, వార్డెన్ సహా మరొ ఇద్దరిపై కేసు నమోదు చేశారు.