సైన్యం చేతిలో కీలు బొమ్మలా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ !
పాక్ ప్రభుత్వాలు సైన్యం చేతిలో కీలుబొమ్మలా మారడం గతంలో ఎన్నో సార్లు జరిగింది, ఇప్పుడే కొత్త కాదు. పాక్ లో పేరుకే ప్రభుత్వ పాలన అయినా దాన్ని నియంత్రించే అధికారాలన్ని కూడా సైన్యం చేతిలోనే ఉంటాయి. కాదని ఏమైనా చేస్తే ప్రభుత్వాన్ని పడగొట్టి , సైనిక దళాల చీఫ్ పాలకుడు కావడం అక్కడ సాధారణం. ప్రస్తుతం పాకిస్తాన్ లో పరిస్థితులను పరిశీలిస్తే మళ్లీ ఆ దేశం సైనిక నియంత్రణలోకే వెళ్తోందా అన్న అనుమానాలు ఏర్పడుతున్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైన్యం చేతిలో కీలుబొమ్మలా మారినవేళ, అక్కడి సైన్యం ప్రదర్శిస్తున్న దూకుడు మళ్లీ సైనిక పాలన తప్పదా అన్న ఊహాగానాలకు ఊతమిస్తోంది. ఇమ్రాన్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పాక్ లో పరిస్థితులు ఇంతలా దిగజారడం ఇదే ప్రధమం కాదు. పాకిస్తాన్ ప్రభుత్వ వ్యవహారాల్లో సైన్యం నేరుగా జోక్యం చేసుకుంటోందంటూ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కొద్ది రోజుల క్రితం చేసిన ఆన్ లైన్ ప్రసంగం తర్వాత అక్కడి పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఆ తరువాత అయన పై కేసు పెట్టడం జరిగింది. అయితే దాని వెనుక సైన్యమే ఉందనేది బలమైన వాదన.
అంతకుముందు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత,దేశ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీపై కూడా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇమ్రాన్ పెత్తనం మాటున సైన్యమే తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపిస్తున్న విపక్షాలు ఉమ్మడి కార్యాచరణకు సిద్దమయ్యాయి. ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఈ నెల 16 నుంచి డిసెంబర్ 31 వరకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని విపక్షాలు నిర్వహించాయి. దీంతో సైన్యం ఆయన్ను కూడా టార్గెట్ చేసింది. సఫ్దర్ బయటే ఉంటే విపక్ష కూటమి మరింత రెచ్చిపోతుందని భావించిన సైన్యం ఆయన్ను అరెస్ట్ చేయాల్సిందిగా.. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన పోలీస్ ఉన్నతాధికారి ముస్తక్ అహ్మద్ మహర్‌ను ఆదేశించింది. ఇందుకు సదరు పోలీస్ బాస్ అంగీకరించకపోవడంతో సైన్యం ఏకంగా ఆయన్నే కిడ్నాప్ చేసింది.
సైన్యం ఆదేశాలను ధిక్కరించినందుకు పారామిలటరీ దళాలే నేరుగా రంగంలోకి దిగి ముస్తక్ అహ్మద్ మహర్ ఇంట్లో తనిఖీలు చేశాయి. అనంతరం ముస్తక్‌ను కిడ్నాప్ చేసి... విపక్ష కూటమి నేత సఫ్దర్ అవాన్ అరెస్టుకు ఆదేశాలిస్తున్నట్లుగా అతనితో బలవంతంగా డాక్యుమెంట్లపై సంతకం పెట్టించారు. ఆ వెంటనే సఫ్దర్‌ను అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ సఫ్దర్ కోర్టు బెయిల్‌పై విడుదలయ్యారు. ముస్తక్‌తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు 10 రోజుల పాటు లీవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అసలే విపక్ష కూటమిని నియంత్రించలేక సతమతమవుతున్న ఇమ్రాన్ సర్కార్‌కు... ఒక్కసారిగా పోలీస్ ఉన్నతాధికారులంతా లీవు కోసం దరఖాస్తు చేసుకోవడం గట్టి షాకిచ్చినట్లయింది. అయితే తనపై ఆర్మీ దౌర్జన్యానికి సంబంధించి ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పోలీస్ బాస్ ముస్తక్ వెనక్కి తగ్గారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తన లీవును వాయిదా వేసుకుంటున్నట్లు తెలిపారు. మిగతా పోలీస్ ఉన్నతాధికారులు కూడా లీవులను వాయిదా వేసుకోవాలని కోరారు. దీనితో ఆ వివాదానికి తాత్కాలిక ముగింపు దొరికినా కూడా మళ్లి ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు అని చర్చలు జరుగుతున్నాయి.