రేపు మోడీ కొత్త స్కీమ్.. విశేషమిదే?
కరోనా లాక్ డౌన్ తో ఉపాధి లేక ప్రజలంతా కునారిల్లుతున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ రేపు కొత్త పథకాన్ని ప్రకటించబోతున్నారు. ‘ప్రధానమంత్రి మత్య్స సంపద యోజన’ పేరుతో ఈ పథకం లాంచ్ చేస్తున్నారు. ఒక కొత్త యాప్ ‘ఇ-గోపాల’యాప్ ను ఆవిష్కరిస్తున్నారు.
మత్స్య రంగానికి చేయూత అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త పథకాన్ని లాంచ్ చేయబోతున్నారు. ఈ స్కీమ్ ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. దీనికోసం రూ.20050 కోట్లు కేటాయించింది. 2020-21 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఈ స్కీమ్ ను అమలు చేస్తారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతుంది.
సముద్రతీరాలు, ఐలాండ్ ఫిషరీస్, అక్వా కల్చర్ లో లబ్ధిదారులకు రూ.12340 కోట్లు, మత్య్స రంగానికి రూ.7710 కోట్లు కేటాయించారు. దేశంలో చేపల ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ఈ కొత్త పథకాన్ని తీసుకొస్తోంది.మత్య్య కారుల ఆదాయాన్ని పెంచాలని మోడీ సర్కార్ భావిస్తోంది.