పాము విషంతో కొవిడ్‌కు అడ్డుకట్ట!

Update: 2021-09-01 17:30 GMT
కరోనా మహమ్మారి వల్ల మన దేశంతో పాటు ప్రపంచం అతలాకుతలమైన సంగతి అందరికీ విదితమే. ఇకపోతే ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్ పూర్తి కాగా ప్రస్తుతం థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా కరోనాకు అడ్డుకట్ట వేసేందుకుగాను ఇప్పటికే పలు వ్యాక్సిన్లు వచ్చాయి. అయితే, రోజుకో కొత్త రకం కొవిడ్ వేరియంట్ పుట్టుకొస్తుండటం వల్ల అది మానవాళిపైన తీవ్రప్రభావం చూపే చాన్సెస్ ఉన్నాయి. డెల్టా వేరియంట్ కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం చూసి జనాలు భయంతో వణికిపోతున్నారు. కాగా, ఇటీవల సీ1.2 వేరియంట్ బాగా వ్యాప్తి చెందుతోంది.

ఈ క్రమంలోనే కొవిడ్ కట్టడికి మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అయితే, కరోనా కట్టడికిగాను బ్రెజిల్ దేశ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు పాము విషంతో కరోనాకు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నారు. ఈ విషయమైప్రస్తుతం వారు పరిశోధనలు చేస్తున్నారు. బ్రెజిల్ స‌ర్ప‌మైన జ‌రారా కుస్సు పాము విషంతో కొవిడ్ మెడిసిన్ ఆల్రెడీ త‌యారు చేశారు. కోతుల‌పై దీనిని ప్ర‌యోగించ‌గా స‌త్ఫ‌లితాలు వచ్చినట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మ‌రిన్ని ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించిన అనంత‌రం అత్య‌వ‌స‌ర వినియోగానికి పరిశీలిస్తామని, ఇందుకు కావాల్సిన అనుమతులకు దరఖాస్తు చేస్తామని పేర్కొన్నారు. అయితే, కొవిడ్ మహమ్మారి కట్టడికి ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్లు రూపొందించాయి. కానీ, అవి నూతనంగా పుట్టుకొచ్చే వేరియంట్స్‌పై తక్కువ ప్రభావం చూపుతున్నట్లు పలు పరిశీలనలు చెప్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే బూస్టర్ డోస్ కింద వ్యాక్సిన్ మళ్లీ తీసుకోవాల్సి ఉంటుందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జనాల్లో కొవిడ్ వ్యాక్సిన్‌పై అవేర్‌నెస్ బాగా పెరిగింది. ఫలితంగా జనాలు ఇప్పటికే ఫస్ట్, సెకండ్ డోస్ వ్యాక్సిన్లు తీసుకున్నారు. అయితే, కరోనా మహమ్మారి తీవ్రత జనం ఊహించినట్లుగా అస్సలు ఉండటం లేదు. ఇక వేవ్ పూర్తి అయింది అనుకునే లోపు మరో వేవ్ వచ్చేస్తున్నది. ఫస్ట్, సెకండ్ వేవ్స్ పూర్తి అయి జనాలు సెటిల్ అయి ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ షురూ అవుతున్న క్రమంలోనే థర్డ్ వేవ్ ముప్పు గురించి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే థర్డ్ వేవ్ వల్ల ఎంతటి ప్రాణనష్టం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పలు దేశాల శాస్త్రవేత్తలు ఇప్పటికే కొవిడ్‌కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్లు రూపొందించారు. అవి జనాలు తీసుకుంటున్నారు.

ఇండియాలో అయితే కోవ్యాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్స్ జనం తీసుకుంటున్నారు కూడా. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఫస్ట్, సెకండ్ డోసు తీసుకున్న వారు త్వరలో బూస్టర్ డోస్ కూడా తీసుకోవాల్సి ఉంటుందని ఓ అధ్యయనం పేర్కొనగా, ఈ విషయమై ఇంకా ఎటువంటి సమాచారం అధికారికంగా రాలేదు. అయితే, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ అయితే ఇప్పటికీ జోరుగానే సాగుతోంది. ఉచితంగా కేంద్రమే వ్యాక్సిన్ అందిస్తోంది. భారతదేశం ఇతర దేశాలకు వ్యాక్సిన్స్ కూడా సరఫరా చేసింది. ఇకపోతే బ్రెజిల్ దేశ శాస్త్రవేత్తలు పాము విషంతో తయారు చేయబోయే కొవిడ్ మందు ఏ మేరకు సఫలమవుతుందో చూడాలి మరి.. ఆ మందు ద్వారా మనుషులకు ఏదేని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే చాన్సెస్ ఉన్నాయా? అనే విషయమై శాస్త్రీయంగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. శాస్త్రవేత్తలు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు.




Tags:    

Similar News