రూ. 1 ఫైన్ చెల్లించిన లాయర్ ప్రశాంత్ భూషణ్ !
కోర్టు ధిక్కరణ కేసులో కొన్ని రోజుల క్రితం సుప్రీం కోర్టు విధించిన రూ. 1 ఫైన్ ను లాయర్ ప్రశాంత్ భూషణ్ చెల్లించారు.రాజస్థాన్ నుంచి కొంత మందితో కలిసి సుప్రీం కోర్టు కు చేరుకున్న ప్రశాంత్ భూషణ్.. ఫైన్ కట్టేశారు. కోర్టు రిజిస్ట్రీకి ఈ సొమ్ము ను చెల్లించానని, అంత మాత్రాన కోర్టు తీర్పు ను అంగీకరించినట్టు కాదని ఆయన తెలిపారు. రాజస్తాన్ కు చెందిన కొంతమంది బృందంతో బాటు ప్రశాంత్ భూషణ్ సోమవారం సుప్రీం కోర్టు ఆవరణ లోకి చేరుకున్నారు. ఈ రూపాయి నాణేలను అనేక మంది సేకరించారని, వీళ్ళు ‘రూపాయి ప్రచారాన్ని’ నిర్వహిస్తున్నారని ఆయన వెల్లడించారు.
ప్రజలు ఇచ్ఛే ప్రతి రూపాయితో ట్రూత్ ఫండ్ అనే ఫండ్ ని ఏర్పాటు చేశామని, నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వెల్లడించేవారు వేధింపులకు గురవుతున్న నేపథ్యంలో అలాంటి బాధితులకు సహాయ పడేందుకు ఈ రూపాయి నాణేలను వినియోగిస్తామని ప్రశాంత్ భూషణ్ చెప్పారు. నేను జరిమానాను చెల్లించానంటే తీర్పును అంగీకరించినట్టు కాదు.. ఈ రోజు రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తున్నాం. ధిక్కారం కింద శిక్ష కోసం అప్పీల్ విధానం తప్పనిసరిగా రూపొందించాలని మేము రిట్ పిటిషన్ దాఖలు చేశాం అని అన్నారు. ఆగస్టు 31న శిక్ష ఖరారు చేసిన సుప్రీంకోర్టు.. సెప్టెంబరు 15లోగా రూ.1 జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష లేదా మూడేళ్ల పాటు న్యాయవాదిగా నిషేధం విధిస్తామని హెచ్చరించింది.