14 న రావాల్సిన సంక్రాంతి 15 కి ఎందుకు వస్తుంది...రీజన్ ఇదే ?

హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని పండుకలు చాంద్ర మనం ప్రకారం జరుగుతాయి. అంటే తిధుల లెక్క అన్న మాట.;

Update: 2026-01-14 19:28 GMT

హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని పండుకలు చాంద్ర మనం ప్రకారం జరుగుతాయి. అంటే తిధుల లెక్క అన్న మాట. దాంతో వాటికి ఒక నిర్ధిష్టమైన తేదీ అంటూ ఉండదు, అవి మారుతూ ఉంటాయి. కానీ తేదీలు మారని పండుగలు అంటే భోగీ సంక్రాంతి కనుమ అని చెబుతారు. ఎందుకంటే ఇవి సూర్యమానం ప్రకారం వస్తాయి. అందుకే కరెక్ట్ గా ప్రతీ ఏటా అవే తేదీలలో వస్తూంటాయి. దాని ప్రకారం భోగీ అంటే జనవరి 13, సంక్రాంతి అంటే జనవరి 13, కనుమ అంటే జనవరి 15 ఇలా మూడు పండుగలకు డేట్స్ ఫిక్స్ అయిపోయాయి. కానీ గత కొన్నాళ్ళుగా చూస్తే ఈ తేదీలలో మారిపోతున్నాయి. 14న రావాల్సిన సంక్రాంతి 15కి వెళ్ళిపోతోంది. మరి ఈ తేడా ఏమిటి ఎందుకు ఇలా జరుగుతోంది అంటే దానికీ రీజన్ ఉంది అని అంటున్నారు.

మకర రాశిలోకి :

ఇక మకర సంక్రాంతి అంటే సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశి లోకి ప్రవేశించడాన్ని జరుపుకునే పండుగ. అంటే అప్పటిదాకా దక్షిణాయం ఉంటుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణం మొదలవుతుంది. ఇలా ఏడాదికి చెరి ఆరు నెలల పాటు ఉత్తర దక్షిణాయనాలు ఉంటాయి. ఇలా ఉత్తరాయణం ఒక పుణ్య కాలంగా కూడా హిందూ విశ్వాసాలలో ఉంటుంది. ప్రకృతిలో కూడా మార్పు కనిపిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరుగుతాయి. అంతే కాదు పగలు కాలం కూడా పెరుగుతుంది. ఇలా సూర్యుడు మకర రాశి నుంచి మిధున రాశిలోకి ప్రవేశించేదాకా ఉన్న సమయాన్ని ఉత్తరాయణం గా కూడా చెబుతారు.

ఇలా ఆలస్యం :

అయితే ప్రతీ ఏటా సూర్యుడు మకరరాశిలోకి ఉత్తరాయన కాలంలో ప్రవేశించేడానికి ఇరవై నిముషాలు ఆలస్యం అవుతోంది అన్నది ఖగోళ శాస్త్ర గణాంకాలు చెబుతున్నాయి. అలా తీసుకుంతే ఇలా చూస్తే మూడేళ్ళకు ఒక గంట ఆలస్యంగా 72 ఏళ్ళకు తీసుకుంటే ఏకంగా 24 గంటలు ఆలస్యంగా అంటే ఒక రోజు ఆలస్యంగా సూర్యుడు మకర సంక్రమణం సాగుతుంది అన్న మాట. అందుకే ప్రతీ 72 ఏళ్ళకు సూర్యుడు ఒక రోజు ఆలస్యంగా మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా మన ఆంగ్ల సంవత్సరం లెక్కలు తీస్తే 14న రావాల్సిన మకర సంక్రాంతి 15కి మారిపోయింది అన్న మాట.

ఇదీ లెక్క :

ఇక చూస్తే 1935 నుంచి 2007 వరకూ సాగిన 72 ఏళ్ళ కాలంలో జనవరి 14న సంక్రాంతి పండుగ వస్తే 2008 నుంచి మకర సంక్రాతి జనవరి 15కి మారిపోయింది. ఈ విధంగా మరో 72 ఏళ్ళ పాటు సాగుతుంది. ఆ తరువాత అంటే 2080 దాకా జనవరి 15నే మకర సంక్రాంతి వస్తుంది. ఇక 2081 నుండి 2153 వరకు జనవరి 16న సంక్రాంతి పండుగ వస్తుందని ఖగోళ శాస్త్ర గణాంకాల ప్రకారం ఆంగ్ల సంవత్సర క్యాలండర్ ప్రకారం చెప్పాల్సి ఉంటుంది. దీనిని బట్టి చూస్తే ఇక మీదట ఏ ఏడాది అయినా మకర సంక్రాంతి అంటే జన్వారి 15నే అని లెక్క వేసుకోవాలి. అది 2080 దాకా అని ఫిక్స్ కూడా కావాల్సి ఉంది. సో మకర సంక్రాంతి అన్నది సూర్య గమనం బట్టి మారుతుంది కాబట్టి సూర్యుడు గమనంలో తేడాలే తేదీలలో మార్పునకు కారణం అని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News