మంచు తుఫానులో రెస్క్యూ... ఒళ్లు గగురు పొడుస్తున్న వీడియో వైరల్!

చుట్టూ ఎటు చూసినా మంచు.. అప్పటికే పెను హిమపాతం కురిసిన పరిస్థితి.. దీంతో మంచుపై మరింత మెత్తగా మారి, కాళ్లు సులువుగా కూరుకుపోయేలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.;

Update: 2026-01-14 19:27 GMT

చుట్టూ ఎటు చూసినా మంచు.. అప్పటికే పెను హిమపాతం కురిసిన పరిస్థితి.. దీంతో మంచుపై మరింత మెత్తగా మారి, కాళ్లు సులువుగా కూరుకుపోయేలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో ఓ స్కీయర్ తనదైన శైలిలో వాలుపై స్కీయింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో కొన్ని అడుగుల దూరంలో పూర్తిగా మంచులో కూరుకుపోయి, ఎర్రని దుస్తులు ధరించిన చేయి మాత్రమే బయటకు కనిపిస్తున్న దృశ్యం అతనికి కనిపించింది. వెంటనే అక్కడికి చేరుకున్నాడు.. రెస్క్యూకు ఉపక్రమించాడు.

అవును... స్విట్జర్లాండ్‌ లోని ఎంగెల్‌ బర్గ్‌ లో ఓ షాకింగ్ రెస్క్యూ ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... హిమపాతం తర్వాత లోతైన మంచు నుండి బయటకు వస్తున్న చేయిని స్కీయర్ గుర్తించి వెంటనే సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ తీవ్రమైన క్షణం వీడియోలో బంధించబడింది. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌ లైన్‌ లో వైరల్‌ గా మారింది. ఈ సందర్భంగా స్కీయర్ వేగవంతమైన, ధైర్యమైన చర్యలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

జనవరి 10న జరిగిన సంఘటనతో.. నైపుణ్యం కలిగిన స్కీయర్ అయిన 37 ఏళ్ల మాటియో.. ఎంగెల్‌ బర్గ్‌ లోని ఒక వాలుపై స్కీయింగ్ చేస్తున్నప్పుడు.. మంచు నుండి ఒక చేయి బయటకు వస్తున్నట్లు అతను గమనించాడు. దీంతో.. ఎవరో మంచులో కూరుకుపోయి, చిక్కుకున్నట్లు గ్రహించాడు. వెంటనే సమయం వృధా చేయకుండా మాటియో పరిగెత్తుకుంటూ వెళ్లాడు.. తవ్వడం ప్రారంభించాడు. ఆ వీడియోలో.. చిక్కుకున్న వ్యక్తి ముఖం, శరీరం నుండి మంచును తొలగించడం కనిపించింది.

అదే సమయంలో.. నిమిషాల వ్యవధిలోనే సమీపంలోని ఇతర స్కీయర్లూ అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి మంచులో కూరుకుపోయిన వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ సమయంలో ఆ వ్యక్తి సజీవంగా, క్షేమంగా ఉన్నట్లు కనిపించాడు! ఈ ఘటన అనంతరం మాటియో.. ఈ రెస్క్యూ వీడియోను ఆన్ లైన్ లో షేర్ చేశారు. దీంతో అది చాలా వేగంగా వైరల్ గా మారి.. విస్తృత ప్రశంసలు అందుకొంది.



Tags:    

Similar News