• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రశాంత్ కిషోర్ క్రెడిట్...

ప్రశాంత్ కిషోర్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నాడా?

By - Tupaki Desk
Update: 2019-04-13 14:56 GMT
పోలింగ్ ప్రక్రియ  ముగిశాకా.. చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి అనేక కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. భారీ ఎత్తున పోలింగ్ నమోదు కావడం, జనసేన కొన్ని చోట్ల టీడీపీ ఓట్లనే చీల్చడం వంటి విశ్లేషణలతో పాటు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుకూలతలు ఏవీ ఈ సారి కనిపించకపోవడం.. ఇక పోలింగ్ తర్వాత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు.. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి గెలవడం కష్టమేనేమో అనే అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉన్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కూడా చాలా మంది అంచనా వేస్తున్నారు. అయితే అసలు కథ ఏమిటనేది ఫలితాలు వస్తే కానీ తెలియదు!ఇక ఫలితాలు రాకముందే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో క్రెడిట్ కోసం పోటీ మొదలైందా? అనే సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి జగన్ పొలిటికల్ సలహాదారు ప్రశాంత్ కిషోర్ టీమ్ హడావుడి ఎక్కువగా ఉంది. ఫలితాలు రాకముందే వారు గెలిచినంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు.

ఇలాంటి నేపథ్యంలో వాళ్లది క్రెడిట్ కోసం పోటీ అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా.. దానికి అనేక రీజన్లుంటాయి. ప్రభుత్వ వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు అంతంత మాత్రంగా ఉండటం.. ఇక జగన్ సుదీర్ఘ పాదయాత్ర, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకూ అంతా గట్టిగా కష్టపడటం.. వంటి రీజన్లన్నీ ఉంటాయి.

ఒక దశలో అసలు ప్రశాంత్ కిషోర్ టీమ్ జగన్ కోసం పని చేస్తూ ఉందా.. అనే సందేహం కూడా కలిగింది. ఎన్నికల ముందు అలా జరిగింది. అయితే తీరా పోలింగ్ తర్వాత మాత్రం పీకే టీమ్ కొంచెం ఓవర్ చేస్తున్నట్టుగానే ఉంది. క్రెడిట్ కోసం పాకులాడుతూ ఉన్నట్టుంది!
Tags:    
  • Prashant Kishor Team 
  • Telugu News 
  • YSR Congress 
  • YSR 
  • Telugu News 

Similar News

'అధ్య‌క్ష ప‌ద‌వే' యువ‌త‌కు ఇచ్చేయండి .. సాయిరెడ్డి పై మీమ్స్‌.. !

2026-11-12 14:30 GMT

మంగళగిరి-తాడేపల్లి సమరం: నారా లోకేశ్‌కు అసలైన పరీక్ష.. వైసీపీకి జీవన్మరణ పోరాటం!

2026-11-12 13:56 GMT

కేజ్రీవాల్ కే గురిపెట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. రూ.7 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం..

2026-11-12 13:50 GMT

'మ‌న్యం'లో జ‌న‌సేనకు మైన‌స్‌లు ఇవే.. !

2026-11-12 13:30 GMT

చిన్న‌మ్మ‌ స‌మ‌ర్థ‌న.. అంతా బాగున్న‌ట్టేనా.. !

2026-11-12 12:30 GMT

సర్పంచ్ పదవికి రూ.కోటిన్నర.. ఎకరం పొలం.. పల్లెల్లో మొదలైన సందడి

2026-11-12 11:41 GMT

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?

2026-11-12 11:30 GMT

రాజకీయాలకు అతీతంగా తెలుగుబిడ్డకు గౌరవం ఇచ్చిన చంద్రబాబు

2026-11-12 11:00 GMT

చంద్రబాబు హిట్ లిస్టులో ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, త్వరలో నిర్ణయం

2026-11-12 10:30 GMT

సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!

2026-11-12 10:17 GMT

పీఆర్‌పీ చీఫ్.. ఎవ‌రీ సాయిరెడ్డి.. ఈ విష‌యాలు తెలుసా?!

2026-11-12 10:17 GMT

Copyright @2026

Powered by Blink CMS