కరోనా భయానికి తోడు..చచ్చిన కోళ్ల గుట్టలు

Update: 2020-06-21 17:30 GMT
ఓ వైపు కరోనా భయం భయపెడుతోంది. ఏ చిన్న అలజడి ఉపద్రవం వచ్చినా కరోనానే అంటూ జనాలు హడలెత్తిపోతున్నారు. ఈ టైంలో చనిపోయిన కోళ్ల గుట్టలు దర్శనం ఇచ్చేసరికి జనాలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు కానీ ప్రకాశం జిల్లాలో ఇప్పుడు మృతిచెందిన కోళ్ల గుట్టలు కలకలం రేపుతున్నాయి.

ప్రకాశం జిల్లా వేటపాలెంలోని రాజీవ్ స్వగృహ ద్వారం వద్ద చనిపోయిన కోళ్లు గుట్టలుగా పడి ఉండడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు ఉదయాన్నే వేసి వెళ్లారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కోళ్ల గుట్టలను పరిశీలిస్తే అనుమానం వేస్తోందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల మృతదేహంలోని కొంత భాగం ఆకుపచ్చ రంగులో ఉండి నోటివెంట రక్తం కారి ఉన్న గుర్తులు కనిపిస్తున్నాయని.. కోళ్లకు ఏదో వైరస్ వచ్చి ఉంటుందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ఇలా జనావాసాల్లో చచ్చిన కోళ్లను అవీ.. వైరస్ బారిన పడినవి పడేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే కరోనా టైం అని.. ఆకుపచ్చరంగులోకి మారిన కోళ్లతో తమకు ఎలాంటి రోగాలు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.


Tags:    

Similar News