పరిమాణం తగ్గుతున్న మొదడు.. పోస్ట్ కోవిడ్ లక్షణమేనా?

Update: 2022-03-11 01:30 GMT
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి. కానీ ప్రజలు మాత్రం కరోనా భయం మరో విధంగా వెంటాడుతుంది. కోవిడ్ తగ్గిపోయినట్లు ఉన్నా కానీ.. కొందరిలో మాత్రం పోస్ట్ కోవిడ్ లక్షణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే అనేక రుగ్మతలతో ప్రజలు అనారోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటుంటే..పోస్ట్ కోవిడ్ లక్షణాలు ఇంకా భయపెడుతూనే ఉన్నాయి.

ఇదే విషయాన్ని తాజాగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా చెప్పుకొచ్చారు. కరోనా నుంచి కోలుకున్న వారికి అనుకోని విధంగా మెదడు సైజు తగ్గుతుందని ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు చెప్పారు. ఇదే విషయాన్ని వారి పరిశోధనలో గుర్తించినట్లు వివరించారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారి నుంచి కరోనా తీవ్రంగా వెంటాడిన వారి వరకు ఇదే సమస్య ను వారు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కరోనా వైరస్ తగ్గిన తర్వాత కూడా ఈ మెదడు తగ్గడం అనేది కొనసాగుతుందని  చెప్తున్నారు. దీని బాధితులను కూడా వారు కలిసినట్లు స్పష్టం చేశారు. చాలా మందిలో కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి మెదడులో కొంత అయినా కానీ సాధారణ స్థాయికి చేరుకుంటుందా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా  మారింది. అయితే కచ్చితంగా దీనిపై స్పందిచంలేమని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు.

కోవిడ్ వల్ల మెదడు సమస్యలు వస్తాయని స్పష్టమైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలు తమ ఉన్నాయని అన్నారు. కొవిడ్ లక్షణాలు తక్కువగా ఉన్న వారిలో కూడా కొన్ని పనులకు సంబంధించి మెదడులోని భాగాలు ఇప్పటికీ పని చేయడం లేదని తెలిపారు.

కోవిడ్ సోకి తగ్గిన వారిలో మొదడు సుమారు 0.2 శాతం నుంచి ఎక్కువగా అంటే 2 శాతం వరకు  తగ్గినట్టు శాస్త్రవేత్తలు గుర్తించినట్లు తెలిపారు. అయితే వారు జరిపిన పరిశోధన లండన్ లో ఆల్ఫా వేరియంట్ ఉన్న సమయంలో చేసిందని తెలిపారు. అయితే పరిశోధనలో మిగతా వేరియంట్లకు చెందిన వారు లేరని స్పష్టం చేశారు.
Tags:    

Similar News