• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మైండ్ బ్లోయింగ్ సర్వే.......

మైండ్ బ్లోయింగ్ సర్వే.... వైరల్ ... ?

By - Tupaki Desk
Update: 2022-05-02 17:30 GMT
ఏపీలో ఎన్నికలు ఇంకా రెండేళ్ళ వ్యవధిలో ఉండగానే సర్వేల గోల స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్యనే మొత్తానికి మొత్తం అంతే 175 సీట్లను గెలిచి తీరుతామని జగన్ పార్టీ నేతల సమావేశంలో చెప్పారు. మరి ఆయనకు ఉన్న సర్వే నివేదికలు అంచనాలను బట్టి చెప్పి ఉంటారేమో అని ఆ పార్టీ నాయకులు అంతా భావించారు. అదే టైమ్ లో 160 సీట్లు టీడీపీవే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెబుతున్నారు. మరి ఆయన కూడా ఏ లెక్కలూ లేకుండా మాట్లాడరు కదా అన్నది మరో వాదన.

ఈ రెండు పార్టీల అంచనాలు, సర్వేలను మించిన సర్వే ఒకటి ఇపుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటీ అంటే ఏపీలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే జనసేనకు 75 సీట్లు వస్తాయట. అలాగే అధికార వైసీపీకి 55 సీట్లు మాత్రమే వస్తాయని, టీడీపీకి 45 సీట్లు వస్తాయని చెబుతున్నారు. మరి ఈ సర్వే జనసేన చేయించినదా లేక ఆ పార్టీ సానుభూతిపరులు చేయించినదా, లేక మైండ్ గేమ్ కోసం ఇలాంటి సర్వేను ఆ పార్టీ వారు జనాల్లోకి వదిలారా అన్న చర్చ అయితే వస్తోంది.

మొత్తానికి చూస్తే ఇది మైండ్ బ్లోయింగ్ సర్వేగానే చూడాలి. జనసేనకు  2019 ఎన్నికల్లో వచ్చినది కేవలం ఒకే ఒక్క సీటు. ఇక మూడేళ్ళ వ్యవధిలో కూడా ఆ పార్టీ సంస్థాగతంగా బలపడినది పెద్దగా లేనే  లేదనే చెబుతారు. అయితే పవన్ క్రేజ్ మాత్రం  ఈ మధ్యన బాగా పెరిగింది. అది ఎంతవరకు ఓటు బ్యాంక్ గా టర్న్ అవుతుంది అన్నది చూస్తే పెద్ద డౌట్. ఇక మరో వైపు జనసేనలో ఈ రోజుకు కూడా పవన్ నాదెండ్ల మనోహర్ తప్ప చెప్పుకోదగిన నాయకుడు అంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన నాయకుడు అయితే లేరు.

ఇక చూస్తే మొత్తం 175 సీట్లలో జనసేన పోటీ చేయాలనుకున్నా బలమైన అభ్యర్ధుల కొరత ఉంటుందని కూడా ఇంకో రకంగా టాక్ ఉంది. ఇవన్నీ చూస్తే జనసేన కేవలం పవన్ సినీ పొలిటికల్ గ్లామర్ మీద, ఆయన సామాజికవర్గం బలం ఆధారపడి ఈ రోజుకీ సాగుతోంది. ఇక పొత్తుల ఎత్తులు ఫలిస్తే మాత్రం ఏపీలో జనసేన దూకుడు గట్టిగానే ఉంటుంది.

కానీ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక  సర్వే మాత్రం అలా ఇలా  లేదు.  జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో హంగ్ వస్తుందనే సంకేతాలతో ఈ సర్వే వివరాలు ఉన్నాయి. అదే టైమ్ లో టీడీపీ మరీ తక్కువగా 45 సీట్లకే పరిమితం అవుతుంది అని కూడా  సర్వేలో పేర్కొనడం బట్టి చూస్తే ఇది పొత్తుల కోసం టీడీపీని బెండ్ చేసేందుకు సీట్లను ఎక్కువ రాయబేరాల ద్వారా తెచ్చుకోవడానికి, రేపటి రోజున పవర్ షేరింగ్ కోసం వేస్తున్న ఎత్తుగడగా చూస్తున్నారు.

మొత్తానికి ఈ సర్వే ఎవరు చేయించారో  తెలియదు కానీ జనసేన సొంతంగా పోటీ చేస్తే కేవలం మూడేళ్ల వ్యవధిలోనే 75 సీట్లకు చేరువ అవుతుంది అనుకుంటే మరో రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో సులువుగా మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లను కూదా చేరుకుంటుందనే చెప్పాలి. మరి ఈ సర్వే మాత్రం జనసైనికులకు ఉత్సాహాం ఇస్తూంటే అసలు ఏపీలో గ్రౌండ్ లెవెల్ లో ఇలాంటి పరిస్థితి ఉందా అన్న చర్చ అయితే వేడిగా వాడిగా అధికార విపక్ష పార్టీలలో చర్చగా సాగుతోంది.
Tags:    
  • Political Survey 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS