‘సామాజిక’ అన్వేషణలో రాజకీయ పార్టీలు
రాజకీయ పార్టీలకు కులమే ప్రాథమిక బలం. ఆ తర్వాతే విధానాలు. జాతీయ పార్టీలైనా, ప్రాంతీయ పార్టీలైనా ఇదే ప్రాతిపదిక. ప్రస్తుతం రాష్ట్రంలోని పార్టీలు ఇదే పద్ధతిలో ముందుకెళ్తున్నాయి. నియోజకవర్గాల వారీగా లెక్కలు వేసుకుంటూనే.. బలమైన సామాజిక వర్గ నేతలను తమ పార్టీలో చేర్చుకునే పనిలో ఉన్నారు. ఇటీవలి చేరికలను గమనిస్తే.. రాష్ట్ర నేతల సామాజిక వర్గానికి చెందినవారు ఆయా పార్టీల్లో చేరారు.
బీజేపీలోకి వారు
తీన్మార్ వార్తలతో వెలుగులోకి వచ్చి, యూట్యూబ్ చానల్ ద్వారా ప్రముఖుడైన వ్యక్తి. మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. యూట్యూబ్ చానల్ ద్వారా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూ, పదుల సంఖ్యలో కేసులను ఎదుర్కొన్నారు. రెండు నెలలు జైలులో ఉన్నారు.
అయితే, కేసుల మీద కేసులను ఎదుర్కొంటున్న మల్లన్న బీజేపీ పెద్దలను ఆశ్రయించారు. మల్లన్న భార్య కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. మల్లన్న జైలులో ఉన్న సందర్భంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మద్దతుగా నిలిచారు.
దీనికితగ్గట్టే మల్లన్న బీజేపీలో చేరారు. ఇక బీజేపీలోకి వెళ్లిన మరో నాయకుడు విఠల్. తెలంగాణ ఏర్పడ్డాక టీఎస్ పీఎస్ సీ సభ్యుడిగా పనిచేశారు విఠల్. పదవీ కాలం అనంతరం టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గం వారు (మున్నూరు కాపు) కావడం గమనార్హం.
టీఆర్ఎస్ లోకి ఈయన
సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం ఆధ్యాత్మికంగానే కాదు.. రాజకీయంగానూ ప్రముఖమైనది. ఇక్కడనుంచి గత రెండుసార్లు చెన్నమనేని రమేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందంటూ ఆరోపణలు రావడం.. దానిపై కోర్టులో విచారణ నడుస్తోంది.
ఆ నియోజకవర్గానికి ఎప్పుడైనా ఉప ఎన్నిక రావచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక్కడ అభ్యర్థి పై టీఆర్ఎస్ ద్రష్టి పెట్టింది. బలమైన నేతకు తోడు బలమైన సామాజిక వర్గం వ్యక్తిని పార్టీలో చేర్చుకుంది. విద్యాసంస్థల అధిపతి, మాజీ మంత్రి కుమారుడై చల్మెడ ఆనందరావును టీఆర్ఎస్ చేర్చుకుంది. ఈయన వెలమ సామాజిక వర్గం వారు.
ఆనందరావు పార్టీలో చేరికకు మంత్రి గంగుల కమలాకర్ ను ఒప్పించారు. గతంలో పోటీదారులైన వీరి మధ్య తీవ్ర విభేదాలు ఉండేవి. ఈ విభేదాలు రాజకీయ పరమైనవే తప్ప తమ మధ్య వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవని గంగుల ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. ఇలా నియోజవర్గాల వారీగా, సామాజిక వర్గాల వారీగా బలమైన నేపథ్యం ఉన్నవారిని పార్గీలు చేర్చుకుంటున్నాయి.