• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పొలిటికల్ హీట్ నుంచి నేతల...

పొలిటికల్ హీట్ నుంచి నేతల ఉపశమనం..విదేశీ టూర్లు!

By - Tupaki Desk
Update: 2019-04-12 16:10 GMT
ఇన్ని రోజులూ మండుటెండలను లెక్క చేయగా.. గట్టిగా కష్టపడిన రాజకీయ నేతలు ఇప్పుడు రిలాక్సేషన్ మూడ్ లోకి వెళ్లిపోతున్నారు. నిన్న పోలింగ్ ముగియడంతోనే పని దాదాపుగా పూర్తి అయ్యింది. ఇక చేయగలిగింది కేవలం ఫలితాల కోసం వేచి ఉండటమే. అందునా ఈ సారి ఏపీ - తెలంగాణ ఎన్నికల ఫలితాలు తొందరగా ఏమీ రావు. మే నెల ఇరవై మూడో తేదీ వరకూ ఫలితాల వెల్లడి ఉండదు.

ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు రిలాక్స్డ్ గా విదేశీ పర్యటనలు పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న వివరాల ప్రకారం.. నేతల విదేశీ పర్యటనల వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి డిటాక్స్ సెషన్స్ కు అటెంట్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా జగన్ అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వచ్చారు. పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి జగన్ గాలికి - ధూళికి - ఎండకూ  - వానకూ తిరిగారు. ఇక ఎన్నికల ప్రచార పర్వంలో విపరీతమైన ఎండలో జగన్ ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో జగన్ మొహమే మారిపోయిన సంగతిని అంతా గమనించే ఉంటారు.

మొహమంతా నల్లగా మారిపోయింది. ఈ నేపథ్యంలో జగన్ ఆ డార్క్ నెస్ ను వదిలించుకోవడంపై కొంత కాన్సన్ ట్రేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తన కుటుంబం, కూతుర్లతో కలిసి గడిపేందుకు జగన్ లండన్ వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక ఇప్పటికే కుటుంబంతో కలిసి రిసార్ట్ కు చేరిపోయాడట బాలకృష్ణ. భార్య, కొడుకుతో సహా కూతుర్లు - అల్లుళ్లను తీసుకుని బాలకృష్ణ రిసార్ట్ లో కూల్ అవుతున్నట్టుగా సమాచారం.

ఇక కాంగ్రెస్ నేత - ఆ పార్టీ తరఫున చేవేళ్ల నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి తన కోసం యోగా సెషన్స్ ను ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

తెరాస నేత కవిత తన పిల్లలతో కలిసి విదేశీ విహారానికి వెళ్లినట్టుగా సమాచారం.కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి కూడా విదేశీ విహారాన్నే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల ప్రచారంలో దుమ్మకూ ధూళికి - ఉక్కపోత - ఎండలో గడిపిన నేతలు ఇప్పుడు కూల్ అవుతున్నట్టుగా ఉన్నారు.
Tags:    
  • Political leaders Vacation 
  • Political Leaders 
  • Vacation 

Similar News

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

Copyright @2026

Powered by Blink CMS